6, అక్టోబర్ 2011, గురువారం

కేంద్రంలో కీలుబొమ్మ - రాష్ట్రంలో తోలుబొమ్మ!ఎన్నాళ్ళీ బొమ్మల కొలువు?


     వరుస కుంభకోణాలతో కేంద్రం,ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది.ధరలపెరుగుదలతో ప్రజలు అల్లల్లాడిపోతుంటే సర్వస్వతంత్ర అనధికార  అధినేత  "మమ్మీ" గారికి చీమ కుట్టినట్టన్నాలేదు. దేశం తగలబడి పోతుంటే నీరోచక్రవర్తి  గారు ఫిడేలు  వాయించుకున్నారట, మరి "మమ్మీ" గారు ఏ వాయిద్యం వాయించు కుంటున్నారో ఎవరికీ తెలీదు. ఏ బాధ్యతా లేని అధికారాన్ని అనుభవిస్తూ దేశ ప్రజలపట్లా, సమస్యల పట్లా, కనీసం ఒక్కసారి కూడా ఏ వేదిక మీదా మాట్లాడిన సందర్భం లేదు.కేంద్రంలో ఒక కీలుబొమ్మని, ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి, తెరవెనుక నుండి ఆమె ఆడిస్తున్న ఆట - ఈ దేశ  రాజకీయ నాయకత్వ దారిద్ర్యం కళ్ళకు కట్టినట్లు కనపడుతోంది.                                                                                                                         టూజీ  స్కాం లో రోజుకో పందికొక్కు పేరు బయటికొస్తోంది.మంత్రి వర్గం లో మంత్రులతో సహా సాక్షాతూ  ప్రధాన మంత్రికి  కూడా ఈ స్కాంలో ప్రమేయం ఉన్నట్లు గా దేశ ప్రజలందరూ నమ్మ వలసిన పరిస్థితి కనబడుతోంది.కొన్నాల్లక్రితం  దేశ ప్రధాని   ప్రధాన మీడియా సంపాదకుల తో మాట్లా దుతూ  "సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని తప్పవు" అన్నట్లుగా  మాట్లాదినప్పుడే అనుమానం వొచ్చింది, ఈ విషయం మొత్తం ప్రధానికి తెలిసే జరిగివుంటుందని.    ప్రణబ్ ముఖర్జీ లేఖ తో అది నిజమని రుజువయ్యింది .ప్రధానమంత్రి ఎంత నిజాయితీ పరుడనుకున్నా ఎవరి స్వలాభం కోసం కళ్ళు మూసుకోవలసి వచ్చిందో చెప్పి తీరవలసిన సమయం వొచ్చింది.   వెనక ఎవరున్నారో బయటికి రావలసిందే, కానీ రానిస్తారా అనేది అనుమానమే.  చిదంబరానికి అప్పుడే    "అమ్మ" కొమ్ముకాసేయడంతో ఆయన ధైర్యంగా , సేదతీరడానికి విహార యాత్ర లకి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా ప్రజలు కోర్టు లనే నమ్ముకోవలసిన పరిస్థితి . కేంద్ర లో  ప్రభుత్వం మీద నమ్మకం  పోయిందనేది నిజం. కానీ ప్రజలకి గత్యంతరం కనబడడం లేదు. ప్రతిపక్షం పాత్ర కూడా గొప్పగా ఏమీలేదు. వరుస కుంభకోణాలతో  బయటపడిపోతున్న ప్రభుత్వ  నగ్న స్వరూపాన్ని ఎండగట్టడంలో, ధరల పెరుగుదలలపై  ప్రజల పక్షాన పోరాడడంలో, విఫలమయ్యారని చెప్పకతప్పదు.                                 ఇక మన రాష్ట్ర పరిస్థితి కి వస్తే, తెలంగాణా రావణ కాష్టంలా రగులుతూనే వుంది. పంజాబ్లో " భింద్రన్ వాలే" ని ఇందిరా గాంధి తయారుచేసినట్లుగానే కేసీయార్ ని కూడా దేశ, రాష్ట్ర  నాయకులే తయారుచేసారు. ఎన్నికలలో టియారెస్  పార్టీతో పొత్తు  పెట్టుకోని పార్టీ   ఉందా?   ప్రత్యేక తెలంగాణా  రాష్ట్రం  కోసం పెట్టిన పార్టీ అని తెలిసికూడా , రాజకీయ స్వార్ధం కోసం, సీట్ల కోసం కేసీయార్ విసిరిన ఎంగిలి(సీట్ల ) మెతుకుల కోసం కక్కుర్తిపడిన పార్టీల  నాయకులకు ఇప్పుడు "సెగ" బాగా తగులుతోంది. TRS పార్టీ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో  గంగలో కలిసిపోయినట్టే. వీరికి ఈ శాస్తి జరగవలసిందే. ఏది ఏమైనా రాజకీయ  నాయకుల రాక్షస క్రీడలో సామాన్య  ప్రజలు సమిధలై పోతున్నారు. గత ఇరవై రోజులుగా రాష్ట్రం తగలబడి పోతున్నా కేంద్రంలో ప్రభుత్వానికి గాని "మమ్మీ" గారికి గానీ చీమ కుట్టినట్లు లేదు.                                                           ఒక తోలుబొమ్మ ని ముఖ్యమంత్రిని చేసి, ఆంద్ర  ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతోంది.  కనీసం తన మంత్రిమండలినే నియంత్రించలేని ముఖ్యమంత్రి పరిపాలన ఏం చెయ్యగలడు? ( కేంద్ర కేబినేట్ పరిస్థితి కూడా ఇదే )  రాష్ట్రం లో ఒక భాగం తగలబడుతుంటే, ముఖ్యమంత్రిగా సమస్య కు  పరిష్కారాన్ని కనుగొనడంలో ఆయన  పాత్ర ఏమిటి ?  ఇల్లుకాలి జనం ఏడుస్తోంటే  ఉత్తరకుమార పధకాలతో ఆయన భుజకీర్తులు తగిలించు కోవాలని ఉబలాట పడిపోతున్నారు.కేజీ రూపాయికే బియ్యమట. ఎవడడిగాడు మిమ్మల్ని? నువ్వు రెండు రూపాయలకిచ్చినా నెలకిసరిపడా ఇవ్వడానికి ప్రయత్నిస్తే పేదలకి పస్తులుండే బాధ తప్పుతుంది.  15 లక్షల ఉద్యోగాలట! ఉన్న ఉద్యోగాలకే దిక్కులేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 108, 104, RTC, అంగన్వాడి, తదితర ఉద్యోగులనే పీకి పారేస్తున్న" ఉత్తరకుమార రెడ్డి "గారూ, జీతాలే ఇవ్వలేకపోతున్న తమరు ఉద్యోగాలిచ్చేవరకు ఉంటారనే నమ్మకం ఉందా?  ఇదే కాదు,ఇంకా చాలా పధకాలు ఉన్నాయట.  2014 లో జరిగే ఎన్నికల ముందు ప్రకటిస్తారట. ఇంతకీ ఈ పదకాలన్నీఎవరికోసమో ఆయనే చెప్పేశారు. "మమ్మీ" గారి సుపుత్రుడు రాహుల్ గాంధి ని 2014 లో ప్రధాన మంత్రి ని చెయ్యడానికేనని!  అంతేగానీ ప్రజల మీద ప్రేమతో కాదు. పాపం,గట్టిగా  తుమ్మితే ఊడే పరిస్థితి లో ఉన్న ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికే  ఆయనకి టైము సరిపోడం లేదు. ఒక పక్క "నూతన వారసత్వసిద్ధాంత కర్త"  మూడుకాళ్ల  "బొచ్చ బాబు " -  ఉట్టికి ఎగరలేక  బొక్క బోర్లా పడి కాంగ్రెస్ పంచన కాలం గడిపేద్దామని వొచ్చిన చిరంజీవి తో కలిసి, ఎసరు పెట్టేస్తాడేమోనని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. ఎవడి పదవుల గోల వాడిదే గానీ ప్రజల గోడు వినే నాధుడు లేదు. పరిపాలన లేదు. ఇక ప్రతిపక్షమనేదే లేదు. ఆయన గారూ పాపం ఒక కన్ను పోగొట్టేసుకున్నారు. ఉన్న మెల్ల కన్ను నైనా కాపాడుకుందామని" ఆంధ్రా హజారే " అవతారంలో పర్యటనలో ఉన్నారు. ఇక మిగిలింది జగను, ఆయనా ఎడతెగని ఓదారుపు యాత్రలో అలిసిపోయినప్పుడల్లా  "దీక్షలో" కూర్చుని రెస్టు తీసుకుంటారు. ఆయన బాధ ఆయనది. పాపం ఆయనని ఎవరు ఒదారుస్తారో . 

అమ్మా , డిల్లీ "మమ్మీ" గారూ, ఇంకా ఎన్నాళ్ళు ఈ బొమ్మల కొలువు? ఇకనైనా  తమరు మమ్మీ అవతారం నుంచి బయటికి వొచ్చి మా దేశానికి, మా నాయకులకు  స్వాతంత్రాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ----ఒక సామాన్యుడు.

3 కామెంట్‌లు:

  1. పంజాబ్లో " భింద్రన్ వాలే" ని ఇందిరా గాంధి తయారుచేసినట్లుగానే కేసీయార్ ని కూడా దేశ, రాష్ట్ర నాయకులే తయారుచేసారు.
    >>>
    మూడున్నర లక్షల మంది రాష్ట్రప్రభుత్వోద్యోగులు, లక్షన్నర మంది ఉపాధ్యాయులు, అరవైఏడు వేల మంది సింగరేణికార్మికులు, యాభై ఎనిమిదివేల మంది ఆర్టీసీ కార్మికులు, ఇంకా ప్రభుత్వాసుపత్రుల వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఇంకా ఆటోడ్రైవర్లు, పూజారులు, రజకులు, భవన నిర్మాణ కార్మికులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ డ్రైవర్లు సంఘీభావ సమ్మెలు చేస్తున్నారు (Curtsey K.Srinivas, Andhra jyoti)తెలంగాణలో సిపీ ఐ , బీ జే పీ, తెలంగాణా తెలుగు దేశం ఫోరం (౩౨ మంది ఎం ఎల్ ఎ లు), సి పీ ఐ న్యూ డెమాక్రసీ పార్టీ
    ఇంతా అనేకానేక ప్రజానీకం, మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొంతుంటే
    మీరు ఇంకా కే సి ఆర్ ఒక్కడి జపం చేయడం ఏమీ బాగో లేదు
    ఇప్పటికైనా తెలంగాణా ప్రజల ఆకాంక్షని గుర్తించండి. తెలంగాణా ప్రజల్లో ఆ ఆకాంక్షే లేక పొతే
    కేసీఆర్ అనే అర్భకుడు ఒక్కడి వాళ్ళ ఏమి అయ్యేది కాదు
    Rajesh, Hyderabad

    రిప్లయితొలగించండి
  2. rajesh:" కేసీఆర్ అనే అర్భకుడు ఒక్కడి వాళ్ళ ఏమి అయ్యేది కాదు "
    1969 తరువాత తెలంగాణా పేరేత్తిన వాడు లేడు.KCR TRS పెట్టిన తరువాత మాత్రమే తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న మాట వాస్తవం కాదా? అయినా తెలంగాణా ప్రజలందరినీ ఏకం చెయ్యడానికి KCR కి పదేళ్ళు పట్టింది.కానీ ఇప్పటికీ మన టీ కాంగ్రెస్ నాయకులు తమ పదవుల్ని వోదులుకో లేక పోతున్నారు. అందుకే సీమాంధ్ర నాయకులు మనల్ని అంత హేళన చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  3. rajyadhikaramkosam rajakeeyapartyla avakasavada vykhari,iteevali samvatsaralalo adhikaramlounna nayakulu hyderabad,aaparisaralalo abhivriddini kendrekarinchi,annee ikkade yerpaucheyadam,swalabhamkosam real estate ranganni protsahinchi,swayamga vandala ekralu tamavariki kattabettadam,tadwara velakotlu aarjinchi nalugydendlalonee velakotlaku adhipatulu kavadam,deenivalla andhra,telangana nayakulu,pettubadidarlu,contractorlu,unnatadhikarula madhya potee tevramy,yellatarabadi asatya prachralu,kattukathala valle prastuta paristhithi erpadindi.rayalseema,uttarandhrato batu rendu mudu telanana jillalu venukabadiunnayi.idi dachestee dagani satyam.congress,tdplu trs tho pottupettukunna papaphalitame idi.10 seatlu kuda gelavaleni trs congress durvidhanala karananga facistuga tayari itarulameeda dadiki tegabadutondi.greatar hyderabad loni kotimandi prajalu vyatirekistuntee vari bagogulu,abhiprayalu pattinchkokunda pratyeka rastram yerpatu sadhyama?rastrala punarvibhajanku sastreeya vidhanam avasaram.
    DAMODAR PRASAD PATAKAMURU.
    SENIOR JOURNALIST
    9440990381
    D.PRASAD1955@gmail.com

    రిప్లయితొలగించండి