25, మే 2014, ఆదివారం

మూర్ఖత్వానికి మరోపేరు కేజ్రీవాల్!

ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ పార్టీ బీజేపీ తరువాత స్థానంలో నిలిచినప్పుడు భారత రాజకీయాలలో నూతన శకం ఆరంభమయిందనే అనుకున్నాం . అధికార పగ్గాలు చేపట్టడానికి కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు కొంచెం అనుమానించినా  ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఇవి తప్పవని సర్దుకున్నాం .అధికారం చేపట్టిన తరువాత తను చేయగలిగినన్ని మంచి పనులు చేసి చూపించిన కేజ్రీవాల్ కు తదుపరి దశలో ముఖ్యమంత్రి పీఠం ముళ్ళ కుర్చీలా అనిపించినట్టుంది . నోటికొచ్చిన వాగ్దానాలు విసిరేసి అమలుచేసే అధికారం లేక ఏదో విధంగా ప్రభుత్వం వదిలి  బయటికి వచ్చేయ్యడానికి తొందర పడ్డారు. దానికి తోడు  ఎదురుగా సార్వత్రిక ఎన్నికలు కనబడుతుండడంతో ఆ ఎన్నికల్లో పోటీచేసి డైరెక్టుగా  ప్రధానమంత్రి అయిపోతే పోలా! అనుకుంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని పేకముక్కలా విసిరేసి వారణాసి వెళ్లి గంగలో దూకాడు . అక్కడ మునిగిన కేజ్రీవాల్ ఢిల్లీ మురిగ్గుంటల్లోదొల్లుకుంటూ  తీహార్ జైల్లో తేలాడు .ఈయన తొందరపాటు రాజకీయాలకి ఇతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు నైరాశ్యం తో  దొరికితే చెంపలు పగలగొట్టారు . అయినా ఇతనిలో మార్పు రాలేదు . ఎవరెవరి మీదనో నోటికొచ్చిన ఆరోపణలు చేసేసి, నోటి దురద తీర్చుకుని  తరువాత వాళ్ళు కేసులు వేస్తే ఎదుర్కోలేక, బెయిల్ ఇస్తామన్నా తీసుకోకుండా ఇది మా పార్టీ పాలసీ అని తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటూ బయట అన్ రెస్ట్ క్రియేట్ చేద్దామనుకున్న కేజ్రీవాల్ కు చివరికి ఫుల్ రెస్ట్ దొరికేలా వుంది .
           ఈ దేశంలో పుట్టి ఇక్కడి రాజ్యాంగాన్ని,కోర్టులను కాదని ఇతగాడు ఎవర్ని ఉద్ధరిస్తాడు?ఇష్టమున్నా లేకపోయినా ఈ చట్టాల్ని గౌరవించి తీరాల్సిందే . లేదంటే నక్సలైట్ల లాగా అడవుల్లోకి వెళ్లి తుపాకి రాజ్యం లో చేరాల్సిందే . లేదా నీ కృషితో అధికారాన్ని చేపట్టి రాజ్యాంగాన్ని,చట్టాల్ని మారిస్తే అందరూ సంతోషిస్తారు . Best of luck.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి