9, డిసెంబర్ 2013, సోమవారం

చెంప ఛెళ్ళు మంది! ఇంకా ఒక చెంప మిగిలేవుంది !

4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మెజారిటీ ప్రజలు ఊహించినట్టుగానే వెలువడ్డాయి . నియంతల పొగరు దిగేటట్టుగానే వోటర్లు తీర్పు చెప్పారు. ప్రజలు తాము ఏమి కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పినా కాంగ్రెస్ రాజమాతకీ, యువరాజు గారికీ ఇంకా అర్ధం కాలేదట !  అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో బాధ్యతలు లేని అధికారాన్ని అనుభవిస్తున్న తల్లీ కొడుకులు ఈ దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఇంకా పరిశోధన చేసి తెలుసుకుంటారట ! ఆ తరువాత సరిదిద్దుకుంటారట! ఢిల్లీ, రాజస్తాన్ ముఖ్యమంత్రులు బాగానే పనిచేసారట! కానీ ఎందుకు వోడిపోయారో తెలియదట! ఏడుపు మొహాలు తుడుచుకుంటూ వొచ్చి ఈ రోజు ప్రెస్ మీట్లో తల్లీ కొడుకులు పలికిన పలుకులివి.
      యువరాజు గారైతే ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ట్రైనింగ్ కి జాయినవుతారట! ఈ కొంగుచాటు బిడ్డడు నేర్చుకోవలసింది ఇంకా చాల వుందట . 120 కోట్ల జనాభా గలిగిన, ఈ భూమి మీద అతిపెద్ద దేశాన్ని గత పదేళ్లుగా ఏలుతున్న కుటుంబం పలుకుతున్న సిగ్గుమాలిన  పలుకులివి.  జ్ఞానం కలిగిన ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పటికైనా ఈ కుటుంబం కళ్ళు తెరిపిస్తుందని ..........  మీరు నమ్ముతున్నారా? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే గెహ్లాట్ , షీలాదీక్షిత్ లు ఎందుకు వోడిపోయారో తెలియదని తల్లీ కొడుకులు చెప్పడంలోనే వారి గుంట నక్క మనస్తత్వం అర్ధమై పోతోంది . తమ నాయకత్వంలో జరిగిన అవినీతి, అరాచకాలను అంగీకరించడానికి వీరింకా సిద్ధంగా లేరనేది స్పష్టమౌతోంది. ఈ వోటమికి ఎవడిని బలిచెయ్యాలో ఆ "బకరా " ఇంకా వీరికి దొరికినట్టు లేదు . "డిబ్బీ రాజా " ఆ పనిలోనే వున్నట్టున్నాడు . అందుకే ఇంకా ఎక్కడా కనబడలేదు . లేకపోతే ఈ పాటికి డప్పూ ,నాలుకా భుజాన వేసుకుని తయారయ్యేవాడే .  
        ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి కావలసింది మోడీ లాంటి నాయకుడే అనేది ప్రజా తీర్పు . ఇది నిస్సందేహంగా మోడీ హవా! ప్రజలు అభివృద్ధినీ నిజాయితీనీ, పారదర్శక పాలననీ కోరుకుంటున్నారనేది ఈ తీర్పు స్పష్టం చేస్తోంది .వాజపేయీ లాంటి మహానుభావుడు ముందు చూపుతో ఈ దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారి ఎంత అభివృద్ధిని మన కళ్ళకు చూపిందో మనకు తెలుసు. సరిగ్గా మోడీ కూడా ఆ తరహాలోనే ఈ దేశాన్ని అభివృద్ధి చెయ్యగలడని ప్రజలు నమ్ముతున్నారు . ఇందుకు గుజరాత్ అభివృద్దే సాక్ష్యం . 
      అయితే భాజపా కూడా ఉలిక్కిపడే విషయం ఒకటుంది . ప్రత్యామ్నాయం దొరికితే ప్రజలు భాజపాని కూడా ప్రక్కన పెట్టడానికి కూడా సందేహించరని ఢిల్లీ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి . రాబోయే రోజుల్లో ఈ విషయంలోమోడీ  జాగ్రత్తపడితే మంచిది! 
                                                  భారత్ మాతాకీ జై!
   

9 వ్యాఖ్యలు:

 1. Congress has been ruling Delhi for the last 15 years, except Jyoti Basu no one has managed 4th time, forget it. Do you think BJP will change Delhi overnight, prepare for your speech after 5 years ;)

  In some states they just change Govts every 5 years, example, Kerala, to some extent Tamilnadu and you can add Rajasthan also in this list. There is very little one can do.

  BTW, in Center itself, UPA is ruling for the last 10 years, doesn't matter if it is Rahul Gandhi or someone else, it is very difficult to bring the same party to power again for a third term unless there is a miracle :)

  Even Vajpayee could not manage a second term, remember that ;)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాత గారూ! మీరు ఏమి చెప్పదల్చుకున్నారో నాకు అర్ధం కాలేదు. ఒక విషయం మీరు గమనించండి. నేను వ్రాసిన ఆఖరు పేరా చదవండి. వొళ్ళు దగ్గర పెట్టుకోకపోతే భాజపా కూడా ఇందుకు మినహాయింపు కాదు అనేది గమనించండి

   తొలగించు
 2. penammeedha nundi poyailo padatam anate idaenemo. avintini vadlinchukunae panilo manmau racists enchukuntunnamu. oo Desama meluko

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ చెత్తవాదంతో ఇంకా జనాన్ని మభ్యపెట్టలేరు. ప్రజలు ఎవరు మతవాదులో,ఎవరు కుహనాలౌకిక వాదులో చాలా బాగా అర్ధం చేసుకుంటున్నారు. జనానికి కావలసింది అభివృద్ధి సుపరిపాలన. ఈ చెత్త వాదాలు కాదు.

   తొలగించు
 3. ha ha Congress will not worry much about this results still they can manage with South Indian Voters to get 3rd term..... Maharashtr and Karnataka are ready to give 100% seats .... and all other local parties are as usual Congress party's other face!


  Narsimha K.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హెహె! మునిగేపడవ ఎక్కాలని ఏ తింగరి వెధవా ప్రయత్నించడనుకుంటున్నాను. am i correct.

   తొలగించు
 4. రెండో చెంపకి ఇంకా సమయం ఉందండి! కంగారు పడితే ఎలా? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రెండు చెంపలవాపు పర్మనెంట్ గా ఉండిపోవాలి కదండీ

  ప్రత్యుత్తరంతొలగించు