15, డిసెంబర్ 2013, ఆదివారం

కేజ్రీవాల్ భయపడకు! అధికారం చేపట్టు!

 ఢిల్లీ ఎన్నికల్లో వోటర్లు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి బీజేపీని , ఆమ్ ఆద్మీని గెలిపించారు . ప్రభుత్వ వ్యతిరేక వోటును ఈ రెండు పార్టీలు పంచుకోగా  బీజేపీకి ఆమ్ ఆద్మీ కంటే నాలుగు సీట్లు ఎక్కువ వున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయ్యలేని పరిస్థితి. ఇటువంటి పరిస్తితుల్లో ఏవో రెండు పార్టీలు కలిస్తే తప్ప అక్కడ ప్రభుత్వం ఏర్పరచలేనప్పుడు ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పరిణతి చెందిన రాజకీయ పక్షాలు సర్దుబాటు చేసుకోవలసి వుంటుంది .అలా కాకుండా మళ్ళీ ఎన్నికలకి వెళ్ళడం ప్రజలకి భారమే కాకుండా మళ్ళీ ఇదే ఫలితాలు వస్తే అప్పుడేం చేస్తారు?
   సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచడం అనేది కలలోని మాట . ఇటువంటి పరిస్థితిలో  కాంగ్రెస్ పార్టీ బేషరతుగా ఆమ్ ఆద్మీకి బయటినుంచి మద్దతు తెలియజెయ్యడానికి సిద్ధపడింది .(కారణం ఏమైనా కానీండి) ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యవలసింది పోయి, మీరెందుకు సపోర్టు చేస్తున్నారో చెప్పండి? మేము మీ మీద విచారణలు జరిపిస్తాం, కొరడాలతో కొట్టిస్తాం, మీరు సిద్ధమేనా? ఇటువంటి ప్రశ్నలు అడగడం ఆమ్ ఆద్మీ పార్టీ  రాజకీయ అనుభవలేమిని తెలియజేస్తోంది .
      పైగా తాము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇచ్చారు . మరి అధికారం లేకుండా ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారు? కేవలం ప్రజావుద్యమాలకే పరిమితమయ్యే ఉద్దేశ్యమే వుంటే అన్నా హజారేలాగా ఎన్నికలకీ, రాజకీయాలకి దూరంగా వుండి ఉద్యమాలు చేసుకుంటే సరిపోయేది కదా?
    ఒక రకంగా ఈ పార్టీ వరస చూస్తుంటే అధికారం అంటే భయపడుతున్నట్టే వుంది .(There is more in AAP's manifesto that will give Kejriwal sleepless nights if he does take the hot seat)
     మొదట వీరు గెలిచింది ఒక చిన్న రాష్ట్రంలో అనేది గుర్తుంచుకుని అధికారం చేపట్టి మీరు చెయ్యాలనుకున్న ప్రజోపయోగకర పనులు చెయ్యండి . వీటికి సహకరించకపోతే ఆ పార్టీల వైఖరిని ప్రజలకి తెలియజెయ్యండి . మీ దెబ్బకి తట్టుకోలేకపోతే ఆ పార్టీలే  మద్దతు ఉపసంహరించుకోవచ్చు . అప్పుడైనా వీళ్ళ నిజస్వరూపం బయటపడి మీకు మరిన్ని ఎక్కువ సీట్లు రావొచ్చు . అంతేకానీ మాకు అధికారం వొద్దు, ప్రతిపక్షంగానే వుంటాం అంటూ భయపడి పారిపోకండి! Best of luck.
( ఈ పోస్ట్ వేసేసరికి శనివారం అర్ధరాత్రి పన్నెండయింది . ఆదివారం ఉదయమే ఈనాడు పేపర్ చూస్తే సీనియర్ కాలమిస్ట్ వీరేంద్ర కపూర్ గారి ఆర్టికల్ కనబడింది . మీరు కూడా ఈ లింకులో చూడండి)

5 కామెంట్‌లు:

  1. చివరి పేరాలో ఉన్న మాటలు అద్భుతం. కేజ్రీవాల్ ప్రస్తుతానికి తన భయంలో వినే స్థితిలో ఉన్నాడా అని అనుమానం. చేతికొచ్చిన ఆదర్శాలన్నీ మానిఫెస్టోలో, మనం గెలిస్తే కదా అనుకుని వ్రాసేస్తే వచ్చే ఇబ్బంది ఇదే. దేశాన్ని పరిపాలించటం అనేది టి వి స్టుడియోల్లో కూచుని సుభాషితాలు వల్లించినంత "వీజీ" కాదు మరి.

    రిప్లయితొలగించండి
  2. కేజ్రీవాల్ మరో చిరంజీవి కాకూడదని నా కోరిక, కాని పరిస్థితులలా కనపడటం లేదు. కాలమే నిర్ణయించాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పారు. మరీ చిరంజీవంత నీచంగా దిగజారరనే అనుకుందాం.

      తొలగించండి
  3. కేజ్రీవాల్, జెపి లాంటివాళ్ళు ప్రతిపక్షంలోనే ఉండతగ్గవాళ్ళు.
    వాళ్ళకి అధికారం నిర్వహించడంకంటే ఉద్యమాలు చెయ్యడమే బాగా వచ్చు.
    వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడం ప్రజాస్వామ్యానికి కూడ మంచిది.

    రిప్లయితొలగించండి