1, నవంబర్ 2011, మంగళవారం

నా జండానే ఎగరవెయ్యని వాళ్ళు నాకు మంత్రులా?

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ !
         తేట తెనుగు మాట్లాడే  నా ప్రజలందరూ ఒక గూటి కింద ఉండాలని  మహానుభావుడు  పొట్టి శ్రీరాములు   తన ప్రాణాలని  త్యాగం చేసి నాకు ప్రాణం పోసాడు.   ఎన్ని "యాస" లున్నా ఎన్ని  "గోస"లున్నా,తెలుగు భాష మాట్లాడే నా ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని ప్రాణత్యాగాలు చేసినవారిని తలుచుకుంటే బాధ కలుగుతోంది.  ఏభై అయిదు సంవత్సరాల  నా చరిత్ర చూసుకుంటే ఏముందీ గర్వకారణం అనిపిస్తోంది. 
       ఈ ఏభై అయిదేళ్ళలో  అనేక మంది నాయకులు నన్ను పరిపాలించారు. మంచి పరిపాలనా దక్షులుగా పేరు సంపాదించు కున్న వాళ్ళున్నారు. అసమర్ధులుగా దిగిపోయిన వాళ్ళున్నారు. కుట్రలతో కూలిపోయిన వాళ్ళూ వున్నారు. తమ పదవీ కాంక్షతో , నన్ను విడదీయాలనీ , ముక్కలు చెయ్యాలనీ , వీధికెక్కి నానావీరంగాలు  వేసి,  తరువాత సిగ్గొదిలి నా కుర్చీనెక్కిన వాళ్ళూ వున్నారు. 
     ఎంతో మంది అతిరధ మహారధులు పరిపాలించినా, నా తోటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంకా వెనకబడే ఉన్నాను. ఒకప్పుడు అన్నపూర్ణగా వెలిగిపోయిన నేను ఇప్పుడు అన్నదాతల  ఆక్రందనలతో , ఆత్మహత్యలతో కుమిలిపోతున్నాను. సమ్మెలూ, బందులతో  అల్లాడుతున్నాను.  కారణం రాజకీయ నాయకులే. నన్నేలడానికి వారు చేస్తున్న కుట్రలూ కుంతంత్రాలతో నన్నూ నా ప్రజల్నీ నాశనం చేస్తున్నారు. నా రాజధాని చుట్టుపక్కల ఉన్న భూముల మీద పెత్తనం కోసం  నన్ను ముక్కలుచేయ్యాలని  చూస్తున్నారు. నా ప్రజల్ని హింసలు పెడుతున్నారు.  ఉద్యమాల  పేరుతో రెచ్చగొట్టి, అమాయక బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. వారి వికృత చేష్టలతో నా శరీరాన్ని  ఛిద్రం చేస్తున్నారు.  ఇన్ని బాధలు పడుతున్నా,  తెలుగు గడ్డపై పుట్టి,  దేశ,విదేశాలలో నా కీర్తి పతాకనెగరవేస్తున్న నా తెలుగు బిడ్డల్ని చూసి గర్వపడుతున్నాను. 
       కానీ  నా తిండి తింటూ, నా నీళ్ళు తాగుతూ, నా కారుల్లో తిరుగుతూ . నన్ను  పరిపాలించే మంత్రులే- నా పుట్టినరోజున జండా ఎగరెయ్యడానికి  కూడా ముందుకు రావడం లేదు. నేనంటే  ఇంత ద్వేషం మున్నవాళ్ళూ ,  పిరికి పందలూ  " ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో" మంత్రులమని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి.  కాశ్మీర్లో ఉగ్రవాదులు  నరమేధం  సృష్టించినా జండా ఎగరెయ్యడం మానలేదు.  అక్కడి పాలకుల సమర్ధత అది.  ఇక్కడ వీరికోసం, వీరి మొహమాటాల కోసం, మంత్రులు జండా ఎగరవేసే సాంప్రదాయాన్నే మార్చేస్తున్నారు.  నన్ను విడదీయాలనుకునే వాళ్ళు, నా జండా ఎగరవేయ్యడానికి చేతులు  రాని  వాళ్ళు ,సిగ్గూ అభిమానమూ ఉన్నవాళ్ళయితే ముందు  నా కుర్చీ నుంచి దిగండి.  నా తిండి తింటూ  నా పల్లకిలో ఊరేగుతూ , నా పేరు చెప్పుకుని  భోగాలు అనుభవించడం మానండి!! 
           మంచి మనిషికొక మాట! మంచి గొడ్డుకొక దెబ్బ! వీళ్ళ కింతకంటే ఎక్కువ చెప్పలేను. ఏడ్చే వాడు  ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. మిగిలిన నా బిడ్డలైనా  సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను !!!

10 వ్యాఖ్యలు:

 1. First thing you should know is potti sriramulu did not fight for united telugu people . he fought for separate andhra state...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. topic empika bavunna..raasina paddati baaledandi. inka baaga rayaalsindi.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. chala strong gaa, gaddi pettaru ?? chaala meaningful gaa undhi..please post this topic to kodandaram and kcr..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మన తెలుగువారి పరిస్థితి ఎలావున్నదో పైన చూస్తే తెలుస్తొంది. పైన వ్రాసిన వ్యాసానికి "అజ్ఞాతలుగా" వ్యాఖ్యలు వ్రాయవలసి రావటమే మన తెలుగు వారి దౌర్భాగ్యం. ఇంతకన్నా ఏమి వ్రాయలి. ఎవరు ఎమైనా మనమందరం గౌరవించుకుంటే నలుగురిలో మనం పలచబడకుండా వుంటాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పొట్టి శ్రీరాములు ఆంద్ర ప్రదేశ్ కోసం చనిపోయాడనడం పచ్చి అబద్దం. ఆయన మదరాసు నగరం "ఆంద్ర" రాష్ట్రంలో కలపాలని మాత్రమె కోరుకున్నారు.

  అప్పటికే ఎన్నికలలో ఓడిపోయి ఖాళీగా ఉంటూ దిక్కు తోచని రాజకీయ నిరుద్యోగులకు ఆ మహనీయుని మరణం సువర్ణావకాశంలా పనికొచ్చింది. హింసాకాండతో పెట్రేగి పోయి అల్లకల్లోలం సృష్టించారు. పదవీకాంక్షతో కళ్ళు మూసుకుపోయిన ఈ రాజకీయ దళారీలు చివరికి మదరాసు నగరం రాకపోయినా రాజీ పడి పొట్టి శ్రీరాములు ఆశయాన్ని తుంగలో తొక్కారు. అలా కుట్రలతో, హింసతో, విద్రోహంతో 1953లో ఆంద్ర రాష్ట్రం అవతిరించింది.

  ಕರ್ನಾಟಕ ಪ್ರಜಕ್ಕೆ ರಾಜ್ಯೋತ್ಸವ ಸುಭಾಶೀಶಗಳು.
  भारत माता की जय हो
  జై తెలంగాణా

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సూపర్ బ్రదర్...కాని మన కళ్ళు ఉండి చూడలేని వేర్పాటు కబోధులకు ఎన్ని చెప్పినా అర్థం కావటం లేదు..అందుకే ఈ వేర్పాటు తెలబాన్ వెధవలను ఆస్ట్రేలియా కు తన్ని తరిమేస్తే అక్కడైన వాళ్ళ సొంత నిజాం నవాబు వారసులతో గొర్రెలు కాచుకొంటూ బాంచన్ దొరా అంటూ బతికేస్తారు..
  ఏది ఏమైనా నా ....మన తెలుగు జాతి రాష్ట్రాభివృద్ధి లో ,సంక్షేమం,వ్యవసాయం,పరిశ్రమలు...ఇలా అన్ని రంగాల్లో No .1అభివృద్ధి చెందాలని ఆశిస్తూ....నిజాం వేర్పాటు వసూళ్ళ తెలంగాణా తీవ్రవాదులతో సహా .....అందరికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు..
  జయహొ తెలుగు తల్లి ...జై జై ఆంధ్ర ప్రదేశ్..జై జై జై తెలుగు జాతి..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. http://pravasarajyam.com/1/politics/2011/11/01/an-exclusive-article-for-a/

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @రక్తచరిత్ర:
  మమ్మల్ని తరిమేస్తవా? అంత సీను మీకు లేదులే.

  మునిగిపోతున్న పడవ లాంటి అంధేరా ప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకొని మిగిలిన ఇంకో రెండు రోజులు పాకులాడండి. మీరెంత అరిచి గీ పెట్టినా తెలంగాణా రాష్ట్రాన్ని ఆపలేరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. /నా జండానే ఎగరవెయ్యని వాళ్ళు నాకు మంత్రులా?/
  /నా జండానే ఎగరవెయ్యని వాళ్ళు నాకు మంత్రులా?/
  మీ జెండా వేరెవరో ఎందుకు ఎగురవేస్తారు?!! నాకర్థం కాలే... మీరే మీ ఝెందాఇనా, ఎజెండా ఐనా మీరే ఎగురేసుకోవాలి, తప్పదు. :))
  -------------------
  /మిగిలిన ఇంకో రెండు రోజులు పాకులాడండి. మీరెంత అరిచి గీ పెట్టినా తెలంగాణా రాష్ట్రాన్ని ఆపలేరు./
  గట్లనా? రెండ్రోజుల్లో ఇచ్చుడు అని ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చుడు అని ముక్కోడు చెప్పుడా? గట్లనే కానితాము. రెండ్రోజులే గద, నేను పుట్టకముంగట నుంచి నేను వింటుడు, గిదే చెప్పుడు. :P :))

  ప్రత్యుత్తరంతొలగించు