29, అక్టోబర్ 2011, శనివారం

అన్నా! మేం దూకతం, నువ్ కింద అగ్గెట్టు! స్వామీ గౌడ్,కోదండ రాం!!


నిన్న సాక్షి పత్రికలో వచ్చిన వార్త చూసి నవ్వొచ్చింది. కెసియార్ కి బదులుగా స్వామీ గౌడ్, కోదండరాం ఆమరణ నిరాహార దీక్ష చేస్తారట. కెసియార్ అగ్గి పుట్టించాలట.ఎన్ని  గొట్టాలు  పెట్టి  ఊదినా   తెలంగాణా పొయ్యి వెలిగేలా లేదు. 42 రోజులు సకల జనులూ సమ్మె చేసినా వేడిపుట్టించలేక, సైలెంటుగా చల్లారబెట్టేసి, ఇప్పుడు మళ్ళీ రెండో "వాయ" కి రెడీ అవుతున్నారు .ఎవరో కొంత మంది మధ్యతరగతి మేధావులూ- ఉద్యోగులూ, ఉస్మానియా విద్యార్దులకే పరిమితమైనట్టుగా కనబడుతున్నఈ ఉద్యమానికి సా మాన్య ప్రజలు దూరంగా ఉన్నారనీ, ఉద్యమం లో వేడి లేదనీ - కృత్రిమంగా పుట్టించాలనీ, మీ మాటల్ని బట్టే తెలిసి పోతోంది.
అయ్యా!ఒకసారి మీరు దేని కోసం ఉద్యమం చేస్తున్నారో పునరాలోచించుకోండి. మీ ఉద్యమ మూలాలెక్కడున్నాయి? పునాదులెక్క డున్నాయి? నాయకులెక్కడున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? అసలు ప్రజలేం అనుకుంటున్నారనేది మానేసి, కుప్పి గంతులు వేస్తున్న మిమ్మల్ని చూసి జనం నవ్వు కుంటున్నారు. మొన్న జరిగిన సకల జనుల సమ్మెలో మీరు ఏ డిమాండ్ల కోసం సమ్మె చేసారో మీ ప్రజలు చూసారు.సామాన్య జనానికి తెలుసు!  మీ సమ్మెలూ, బందుల వల్ల బాగుపడేది నాయకులేననీ, ఈ నాయకుల వల్ల ఒరిగి చచ్చేది ఏంలేదని! (సాక్షాత్తూ స్వామీ గౌడ్ గారే తమ నాయకుల వ్యవహార శైలి పైన ఆగ్రహం వెళ్లగక్కారు)

     సామాన్య ప్రజల్ని ఒప్పించలేని ఏ ఉద్యమమూ ముందుకు వెళ్ళలేదన్నది వాస్తవం.సామాన్య ప్రజల్ని ఒప్పించాలి. వారిని భాగస్వాముల్ని చెయ్యగలగాలి. దానికి తెలివైన, నిజాయితీ కలిగిన నాయకత్వం దారి చూపించాలి . అప్పుడే ఆ ఉద్యమం సత్ఫలితాలనిస్తుంది. ప్రజల్ని ఒప్పించాలంటే సహేతుకమైన కారణం,ఆధారం ఉండాలి. దురదృష్ట వశాత్తూ ఈ ఉద్యమానికి ఆ రెండూ లేవు.(మొండిగా బండగా జై తెలంగాణా అనడం తప్ప) మీరు ఎన్ని జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నించినా మీ నేత పీతలు క్రిందకి లాగుతూనే ఉంటారు. మీరు ఏ రోజైతే మీ నేతలందర్నీ" ఒకగదిలో పెట్టి తాళం వేసి" ఆమరణ నిరాహార దీక్ష చేయించగలరో ఆ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా మీకు తెలంగాణా వొచ్చినట్టే! అన్నట్టూ, ఈ రోజు డిల్లీ స్టేట్మెంటు చూసారా? జనవరి నెలాఖరు తెలంగాణా కి "చావుగీతంట.(డెడ్ లైనంట)" ఇంకా ఎన్ని" డెడ్ లైన్లు " పెడతారో చూద్దాం!!
వోట్ల కోసం, నోట్ల కోసం, తెలంగాణా నాయకులు "నిప్పు "జేబులో పెట్టుకుని గంతులేస్తున్నారు. అది వారిని కాల్చి మసి చేసి తీరుతుంది!!

11 వ్యాఖ్యలు:

 1. ఈ వారం, ఏబీయన్ లో కంచె ఐలయ్య గారితో ఇంటర్వ్యు సారాంశం: జగన్ ని అణచడానికి కాంగ్రెస్సు ప్రభుత్వం తీసుకున్న అస్త్రం 'తెలంగాణా ఉద్యమం'. కేసీయార్ ఇందులో పాత్రధారి. అందుకే ఏం చేసినా కేసీయార్ ని కేంద్రం ఉపేక్షిస్తూ వచ్చింది. మోతాదు మించినప్పుడల్లా ఢిల్లీ పిలిపించుకుని అదేశాలిస్తూ వస్తోంది. తెలంగాణా ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఆ సంగతి కేంద్రానికే కాదు, కేసీయారుకీ తెలుసు. కానీ ఉద్యమం వల్ల కలిగే లాభాల దృష్ట్యా చిదంబరం దర్శకత్వం దృష్ట్యా, ప్రజలను రాని తెలంగాణా వైపు నడిపిస్తున్నాడు. అంటే ఎదురుగా గోడ ఉంది. కానీ అది రోడ్డేనని భ్రమింపజేసి ప్రజలను ఉద్యమమనే కారులో అతివేగంగా ముందుకు నడుపుతున్నాడు కేసీయార్. ఫలితంగా, తెలంగాణా ప్రజలు సర్వం కోల్పోవలసి వస్స్తుంది. ఇప్పుడున్న ఉద్యమ నాయకత్వంలో విలువలు లేవు. కలక్షన్లు మీదే ఆసక్తి. బడుగు కులాల వారినే సమిధలు చేస్తున్నారు. నిస్ప్రుహకి లోనుచేసి ఆత్మహత్యలకి ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచి లక్షణం కాదు. విలువలు లేని ఉద్యమ నాయకత్వం వల్ల వచ్చేతెలంగణా వల్ల మరింత నష్టం. కాబట్టి తెలంగాణలో చచ్చే కంటే సమైక్య రాష్ట్రంలో బతకటం మేలు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణా ప్రజలతో తెరాసా, కాంగ్రెస్సు ఎలా చెలగాటమాడుతున్నాయో తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Suresh; where was Jagan when TRS won 3 ZP seats? Possibly in his diapers :)

  ఐలయ్య ఏమి రాస్తడో ఆయనకే ఎరిక లేదు. చంచాలు మాత్రం మస్తుగ తయ్యారు copy-paste చేయడానికి LOL!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ee maatalu kaneesam khammam district ki vachhi ani chuda radandi sir.... malli anadaniki meeku dairyam vundadu. Plz plz plz okkasari Telangana lo ee maatalu ani chudandi......

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అఙ్ఞా(ని)త గారు... ఖమ్మం ఆంధ్రప్రదెశ్ లోనే ఉంది!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. baabu Phani, Vote kosam Note Kosam chesedhi Seemandra Rajakeeya Veeshayalu. meeru vote veese mundhu telvadha ye party telangana isthadhi ani. appudu yekkada poyaru meeru. Sakala Janula samme gurichi matlade arhatha meeku ladhu.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. santosh చెప్పారు...
  Sakala Janula samme gurichi matlade arhatha meeku ladhu.
  ఎందుకు లేదు? మీరు చేసిన సమ్మె valla ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకేం తెలుసు? మీ సమ్మె ఎందుకు చేసారో మీరు సమ్మె విరమించిన రోజునే తెలిసి పోయింది. నిజాల్ని ధయిర్యంగా ఒప్పుకునే దమ్ము కావాలి.రైల్వే చట్టం కింద కేసులు పెట్టగానే రోకోలు బందు. మూడురోజుల బందు ఒకరోజుతో సరి. కేసులూ, కోర్టులూ అనగానేసకల జనుల దుకాణం సర్దుడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "Sakala Janula samme gurichi matlade arhatha meeku ladhu. " - తోటి పౌరులకు ఇబ్బంది కలక్కుండా ఉన్నంతవరకు నీ ఇంటో నువ్వు కూచ్చోని అన్నం, నీళ్ళూ మానేసి ముసుగ్గప్పుకుని పొడుకున్నా, ఇంకేం చేసినా ఎవుడికీ మాట్టాడే అర్హత లేదు, నిజమే!

  కానీ, ఏ పని చేసి ప్రజలకు సేవ చెయ్యాలో ఆ పని మానేసి ప్రజలకు కష్టం కలిగిస్తూంటే మాట్టాడే అర్హతే కాదు, ఛెడామడా తిట్టేసే హక్కు కూడా పౌరుడికి ఉంది. సమ్మె చెయ్యడం చేసేవాడికెంత హక్కో.. తనకు కష్టం కలిగించినవాణ్ణి విమర్శించడమూ పౌరుడికి అంతే హక్కు!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నిజమే!
  'మీరో సారి బూర వూదండి సార్, నాగుల్లా నాట్యం చేస్తాము, అవసరమైతే ;) '
  'మీరో సారి పిలుపు నివ్వన్రు సార్, వసూల్ చేసుకుంటాము వసూల్ రాజాల్లా'
  'జీతాం ఎవలిక్కావాలి సార్, పైఆదాయం పోతుందని సమ్మె విరమణ చేశాం'
  ఇలా వుంటాయ్ వీళ్ళ మాటలు.

  ఇక వీళ్ళ నాయకుడు సరేసరి, కావాలంటే ఫొలవరం టెండర్లు కేన్సిల్ చేసుకోన్రి అట, ఈయన కేన్సిల్ చేసుకోడట, ప్రభుత్వం కేన్సిల్ చేస్తే ' ఆంద్రోళ్ళు మాకు కాంట్రాక్టులీయలేదూ అని పెచారం చేసుకుందామనేమో! :) మూసీనీళ్ళు తాగే ఇంత తెలివితేటలు ప్రదర్శిస్తూంటే.... ఇక గోదారి నీళ్ళు తాగే...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. SNKR చెప్పారు... మూసీనీళ్ళు తాగే ఇంత తెలివితేటలు ప్రదర్శిస్తూంటే.... ఇక గోదారి నీళ్ళు తాగే...
  hahha hahhaha! chaalaa baagundi.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. పైన అఙ్ఞాత గారెవరో నన్ను ఖమ్మం లో ఈ మాటలు అని చూడమని సవాలు చేసారు. అయ్యా, ఖమ్మం లో ఏం ఖర్మ, సాక్షాత్తూ వరంగల్లులో మా స్నేహితులు చాలా మందితో ఇదే ప్రస్తావిస్తే, వాళ్ళు కేసీయార్ ని తెగ విమర్శ చేశారు. ఎందుకు అన్నీ అడిగి చెప్పించుకుంటారు? ఐనా, ఐలయ్యగారు, అంతపెద్ద పుస్తమే రాసి దేశమంతా పంచిపెట్టాకా, ఇంకా నన్ను ఖమ్మంలో అని చూడండి, మంచీరియాల్లో అనిచూడండి అంటారేంటీ?

  ప్రత్యుత్తరంతొలగించు