తెలంగాణ లో" ఆకలి జనుల సమ్మె" జర స్పీడుమీదుంది. గా దినం " రాజకీయ ఆకలి జనులంతా" సికింద్రబాద్ టేషన్ల " ఆలో పోలో "కార్యక్రమం చేస్తున్రు. టేషనంత చేపల సంత లెక్కుంది. "పేరాస" పార్టీ జిందాబాద్ " "గోసీయార్ జిందాబాద్ " అనుకుంట అరుస్తున్నరు. ఇంకో పక్క" పిశాచ రావు "నాయకత్వం వర్దిల్లాలే" " కేడీ"యార్ జిందాబాద్ " . అనుకుంట ఇంకోడు అరుస్తున్నాడు. ఆ పక్కనే "అమ్మా, ఎరకలమ్మా" నువ్వీడ అలిగితే ఎట్లమ్మా ? నువ్ కూడా డిల్లీకి రావాలే" అని బతిమాల్తున్నరు. ఎరకలమ్మ ఇనుడ్లేదు. నా ఎన్కనే ఎవరో మూలుక్కుంటున్నాడు. ఎవరా అని చూస్తె "అరదండ రాం". ఎవడూ నాకు జై కొడ్తలేదేంది అని గుస్స గున్నడు.
ఇంతలో " టీకా" నాయకులు "బోకే , జానతా నై రెడ్డి , కన్నం ఖర్మాకర్, బొంద జోగినాధం ,బోస్కీ యాస్కీ ,కోన్ కిస్కా లంతా ఆలో పోలో మంటూ ప్లాటుఫారం మీద కొచ్చిన్రు . "గుడియా మేడం నాయకత్వం వర్ధిల్లాలే "" ఊహల గాంధీ నాయకత్వం వర్దిల్లాలే ".అనుకుంట రైలుపెట్టెల కాడికి పోతున్నరు.ఇంట్లనే ఒకడు "కస్సుబుస్సార్ జిందాబాద్" "జై ఎయిర్ గన్ " అనుకుంట పూనకం వచ్చినట్టు అరవబట్టిండు. మిగిలినోళ్లు ఆడి నోరు నొక్కేసి ఇప్పుడాల్ల గోలేందిరా బాబు ! లొల్లి లోల్లయిపోద్ది . అనుకుంట పక్కకి తీసుకి పోయిన్రు.
ఇదేదో బలే తమాసగుంది అనుకుంట ఎనక్కి సూద్దునా !
" చుంచుబాబు నాయకత్వం వర్దిల్లాలే" అనుకుంట కేకలినబడ్తన్నై.ఆ ఎంటనే కోడిగుడ్ల వాన కురిసింది. "ఏం పర్లేదమ్మ , ఇంకా వెయ్యండి . రెండు కళ్ళూ మసగ్గా కనబడతన్నాయని వెళ్తే , డాక్టర్ గారు పచ్చి కోడిగుడ్లు , పచ్చిపాలూ బాగా తాగామన్నారమ్మ! మాయావిడ ఎలాగా పాలమ్ముకుని బతుకు తుంది గాబట్టి పాలకి లోటు లేదుగానీ, బీదవాడిని కోడిగుడ్లు కొనుక్కో లేకపోతున్నానమ్మా, ఇంకా వెయ్యండి, అనుకుంట మొకం మీద పడ్డ సొన నాకేస్తున్నడు. ' చుంచు బాబు' టీతె తమ్ముళ్ళని రైలెక్కించటానికి వొచ్చినట్టున్నాడు. "జాగర్తమ్మ ! ఆ మాయలోడు గోసియార్ బుట్టలో పడమాకండి. మీరంతా ఒకే పెట్టెలో వెళ్తున్నారు.మిమ్మల్నికూడా లా గేసినా లాగేయగల్డు. జాగర్తగా తిరిగి రండమ్మ, అని జాగర్తలు చెపుతున్నడు. ఇదంతా ఓ పక్క నుంచి చూస్తున్న "డాక్టర్ రోగం " పళ్ళు పటపట కొరుకుతున్నడు. జై తెలంగాణా అన్నందుకు నన్ను బయటిగ్గెంటి,ఈ దయలేని రావుని , చీమంత రెడ్డిని, రైలెక్కించి ఎల్తవా ? కంగారుపడక . రాబోయే ఎలచ్చన్ల నీ రెండు కళ్ళూ "నేత్రదానం" చేసేటందుకు రడీగుండు, అనుకుంట లోపలకి పోయిండు.
ఇంతకీ ఏంటంటే ,తెలంగాణా సమస్య మీద గుడియా మేడం డిల్లీ ల మీటింగ్ బెట్టింది. అన్ని పార్టీ లోల్లూ ఒకే పెట్టిలో కలిసికట్టుగోస్తేనే తెలంగాణా ఇస్తదంట. అందుకని అందరూ జై కొట్టుకుంట బయలెల్లినారు. అదీ సంగతి.!
మర్నాడు బండి డిల్లీ చేరింది. టేషన్ లొ " ఆంజనేలన్న " వీళ్ళందర్నీ రిసీవ్ చేసుకున్నడు.ఏమయా ! మేడం కేమి తెచ్చిండ్రు? అనడిగిండు. అందరూ ఒకళ్ళ మొకా లొకలు చూసుకుంట ఏం తేలేదని చెప్పిన్రు. ఆంజనేలన్న గుస్సయినడు. అదేందివై. మేడం తాన్కి పొయెతప్పుడు ఉత్త సేతులతోని బోతరా ఏందీ? ఏదోటి పట్కపోతే మంచిగుంటది. ఆమె తెలంగాణా ఇయ్యాల్నా వొద్దా ? అన్నడు. అదికాదన్న మాకు బందు కదా ఏమీ దొరకలే,తేటానికి. సరే నువ్వే చెప్పరాదే, ఏమియ్యాల్నోఅన్నరు.మేడం కి హెల్తు బాగలేదు కదా మీ ఇష్టం. పళ్ళో కూరగాయలైనా పర్లే . అన్నడు.
ఇంతల "అవివేకు" ఫ్లయిటులో వొచ్చిండు. మా నాయన డిల్లీల ఉండుంటే ఆయనే చూసుకునే వోడు ఇయ్యన్నీఅనుకుంట పళ్ళు కొనేతంద్కు అందర్నీ తీస్కపోయిండు. మార్కెట్ల అందరూ తలోదిక్కుకి బోయి దొరికినియ్ కొన్నరు.
అందరూ తెచ్చినయి పట్టుకుని మేడం ఇంటికి పోయిన్రు. ఇంతలో " కుచ్బీనహీ జాదూ "గారొచ్చిమనోల్లని జూసి నవ్వుకుంట లోపటికి బోయిండు. ఆ ఎన్కనే "పెతాంబరం" ఇంకా "బోర్" కమిటీ అంతా లోపట్కిబోయిన్రు. మనోల్లందరూ నువ్వేం తెచ్చినవంటే, నువ్వేం తెచ్చినవంటా అడుకుంటున్నరు."బోకే" మంచి బొకే తెచ్చిన అన్నడు.నిజంగనే బొకే మంచిగుంది. పచ్చని ఎదురు బొంగులో పూలు గుచ్చి చేసిన్రు. పిశాచరావు గేటు కాడ గడబిడ చేసి,బోకేతో వాచ్ మెన్ ని కొట్టిండు. తెచ్చిన బొకే పూలుఉడిపోయి బొంగు మిగిలింది. ఇదే పట్క పోత, దీంతోని సీమాన్ధ్రోల్లు బొంగు చికెన్ చేసుకుంటరని మేడం కి చెప్త నన్నడు." డాక్టర్ రోగం "మంచి బీరకాయలు తెచ్చిన అన్నడు. బోస్కీ పొట్ల కాయలు, కన్నం గుమ్మడి కాయలు , టీ తే నాయకులు పసుపురంగు దోసకాయలు, తెచ్చుకున్నరు. జానతా నై మంచి పొడుగైన బుసావలీ అరటిపళ్ళు తెచ్చిన నన్నడు. ఇంతలోకి " ఆంజనేలన్న" వొచ్చి ఒక్కొక్కర్నీ లోపలకి వెళ్ళ మన్నడు.అందరూ" గోసియార్ ఏడీ" అని పరేషాన్ అవుతుంటే " మేకుల్ రెడ్డి"గారింటికెల్లిండని చెప్పిన్రు. . సరే ఆయనోస్తడులే గాని, మీరు పొండి అనంగానే , అందరికంటే ముందు జానతానై ని ఎల్ల మన్నరు. ఆయన తెచ్చిన పచ్చఅరటి పళ్ళుపట్టుకుని లోని కెల్లిండు. గదిలో పదిమంది కమాండో లు తప్ప బోర్ కమిటీ ఎవరూ లేరు. ఒక కమాండో వొచ్చి ఆయన చేతిలో అరటి పళ్ళు లాక్కుని, " పేంట్ తీసి వొంగో మన్నడు." మనోడికేం సమఝైథ లేదు. మేడం ఏది అనడిగిండు. "పోదువులే కంగారు పడక ఒంగో" అని చెప్పి ఆయనతెచ్చిన అరటి పండు బలవంతంగా "ఎనీమా" గొట్టం లాగా తోసేసి లోనికెల్తరా! అనడిగిండు. అప్పటికే కళ్ళు తిరిగిన ఆయన దణ్ణం పెట్టి, దొడ్డి దారిచూపెడితే బయటికి పోతనన్నడు. వరసగా నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటా ఒక్కోల్లూ వొచ్చుడూ, దొడ్డిదారిన పోవుడు. అందరూ అయిపోయిన్రు. "డాక్టర్ రోగం" గురక కొడుతుంటే లేపి లోపటికి పో మన్నరు . ఆయన ఆవులిచ్చుకుంట బీరకాయలు పట్టుకుని లోనికి పోయిండు. కమాండో లు బీరకాయల్తో ఎనీమా చేస్తుంటే ఆయన వూరికే ఇరగ బడి నవ్వుతుండు. కమాండో లకి దిమాగ్ ఖరాబయింది . గిదేందివయా పిశాచరావు, బోకే, గీకే, బోస్కీ యాస్కీ లందరూ ఇగెప్పుడూ డిల్లీ కి రామనుకుంట గోలెట్టు కుంట పో యిన్రు. నువ్వు బీరకాయదోసినా ఇరగబడి నవ్వుతున్నవ్, చెప్పక పోయినవో నీ తలకాయ ఎయ్యి ముక్కలవుతది అని గన్ గురి పెట్టిన్రు. ఆయన పకపకా నవ్వుకుంట "నాఎనక "గోసియార్ " మేకుల్ రెడ్డి దొడ్లోంచి " పనసకాయ" తెచ్చు కుంటుండు. అని దొల్లుకుంట నవ్వబట్టిండు.
డిల్లీ టేషన్ : మనోళ్ళు ఒక్కోళ్ళూ వొచ్చి పెట్టిలో ఎక్కుతున్రు. ఎవరూ మాట్లాడ్తలేరు. గోసియార్ ఏమైనాడో ఎవరికీ దెల్వదు. లోని కెల్లినోల్లు ఏమైనారో అర్ధం కాక మైకు గొట్టాలట్టుకుని పేపరోల్లందరూ టేషన్ కొచ్చేసిండ్రు.మైకులు చూడంగానే నాయకులు ఓపిక తెచ్చుకుని "అమ్మా ఇప్పటికే లాక్కో లేక పీక్కోలేక చస్తన్నం,తెలంగాణా ఇయ్యకపోతే ఇక మళ్ళీ డిల్లీ రామని గట్టిగ చెప్పినం ,అంటుండగానే" ఆంజనేలన్న"అక్కడికొచ్చిండు."ఏంది వయా ఒక్క మాటైన చెప్పకుంట అందరూ ఉరికోచ్చిన్రు. మేడం ఏం చెప్పింది".అనడుగుతున్దంగనే, అందరూ సైలెంట్ గా " ఆంజ నేలన్నని "పెట్టెలోకి తీసుకెల్లిన్రు. కాసేపటికి అంబులెన్సు టేషన్ గేట్లో ఉంది. వెదురు బొంగు తో స్ట్రెచర్ మీద "ఆంజనేలన్న".......
మర్నాడు హైద్రబాద్ లో పేరాస పార్టీ ప్రెస్ మీటు. ఎరకలమ్మ ఆవేశంగా ఎగురుతున్నది . డిల్లీ నుంచి మన అన్న తెలంగాణా ప్రజల కోసం పనసకాయలు తెస్తున్నడు. మనందరం ఎదురెల్లి ఘనంగా స్వాగతం చెప్పాలె..అంటుండగానే పేరాస పార్టీ నాయకులందరూ ఒక్కొక్కరూ జారుకున్నరు. ఆ రకంగా" ఆకలి జనుల" ఆకలి తీరింది. సర్వేజనా సుఖినోభవంతు.
మనవి : ఇది ఎవరినీ కించపరచడానికి రాయలేదు.గత నెల రోజులుగా తెలంగాణా రాజకీయ నాయకులు ప్రజలతో ఆడుకుంటున్న వికృత క్రీడ చూసి ఆవేదనతో నా మనసు పడిన బాధని ఈ రకంగా మీతో పంచుకొంటున్నాను. తెలంగాణా ప్రజల పట్లా , వారి పోరాటం పట్లా నాకు అపారమైన సానుభూతి ఉంది. సామాన్య ప్రజలని కించపరచాలనే ఆలోచన నాకు లేదు. ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి.
navvalEka chastunna. wonderful.
రిప్లయితొలగించండిజై పనసకాయ
రిప్లయితొలగించండిjai naa telangana panasakaya.. jai jai naa telangana panasakaya..
రిప్లయితొలగించండిసర్వేజనా సుఖినో భవంతు అనకండి.
రిప్లయితొలగించండిసర్వేజనా "సమ్మె" భవంతు అనండి.
కెవ్వు కేక. పిశాచరావ్ పేరు చక్కగా అతికింది.
రిప్లయితొలగించండిఎదురు బొంగు-పిశాచరావు
రిప్లయితొలగించండిజానతా నై రెడ్డి-బుసావలీ అరటిపళ్ళు
డాక్టర్ రోగం-బీరకాయలు
గోసియార్-పనసకాయ---అబ్బబ్బ కడుపు చెక్కలవుతుందండీ.హేట్సాఫ్
అబ్బో అదరగొట్టేసారు, నవ్వి నవ్వి కంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి
రిప్లయితొలగించండిమా కేక మొదలైనాక ఇట్టాంటి కేక ఇంతవరకి మేం ఇనలే. అదిరింది. జంబలకిడి పంబ సినిమా చూసినట్టుంది.
రిప్లయితొలగించండిadbhutam! navvaleka chastunnam baboo!!
రిప్లయితొలగించండిnice,, very nice
రిప్లయితొలగించండిరక్తచరిత్ర....నీవు వేయి చెప్పు, లచ్చ చెప్పు. మా చదువుకున్నమావో, కమ్యునిస్ట్ వేర్పాటు గాడిదల సంఘానికి పోలవరం వసూళ్ళ అవినీతి పరులు పిచ్చ పిచ్చగా నచ్చుతారు. మేం ఓటేసి, వాడి సంపద పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నం.
రిప్లయితొలగించండి:- ఇట్లు మావో ముక్కన్న వేర్పాటు వెర్రి గోర్రేలం..
http://www.youtube.com/watch?v=7_iTOajYRuY
మీలాంటి మావో వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి..
రిప్లయితొలగించండిమా ఇష్టంవయా..మేమెట్లగావాల్నంటె గట్లనె అంటం. అన్నంక గట్లనలే అంటం. పక్కనోడు గిట్ల ఏం అనకుంటె గూడా బాజప్తా అన్నడనిగూడ అంటం.పోలవరం టి డి పి వాళ్ళదే అంటాం..ఎంత మా వోళ్లకి మామూల్లలో వచ్చినా..గిందులో నిజమేంది అబద్ధమేంది ? (ఇప్పుడొక పాట.అంతా నా ఇష్టం...లలలా) ...కామెడీ చేసినా తెలంగాన్ల మెమె జెయ్యాలె!!!....మావో KCR..
రిప్లయితొలగించండి