17, డిసెంబర్ 2013, మంగళవారం

సోనియమ్మా తొందర పడకమ్మా! ఆ వోట్లుకూడా నీకు పడవు!

    స్వలింగ సంపర్కం నేరమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది . భారతీయ సంస్కృతీ,సాంప్రదాయాలు తెలిసిన వారు  దీనిని ఖచ్చితంగా స్వాగతిస్తారనే అనుకుంటున్నాను . ఇప్పటికే విదేశీ అనుకరణలు, విపరీత పోకడలతో సమాజంలో జరగరానివి జరుగుతున్నాయి .  ఈ ప్రపంచం మనుగడ సాగించడానికి, ఈ భూమి మీద మానవజాతి తన సంతతిని పెంచుకోడానికి సృష్టించబడిన వాళ్ళే స్త్రీ పురుషులు . ఇది కేవలం స్త్రీ పురుషుల వల్లనే సాధ్యం . ఏ స్వలింగ సంపర్కుల వల్లా ఇది సాధ్యం కానిది. నీతికీ, జాతికీ, ప్రకృతికీ విరుద్ధంగా జుగుప్సాకరమైన ఈ సంబంధాలని ఏ తల్లితండ్రులూ ప్రోత్సహించరు. ఈ విపరీత పోకడ వలన సమాజానికి హానే తప్ప ఏ మాత్రమూ మేలుజరగదు.కొంతమంది వ్యక్తి స్వేఛ్చ పేరుతో వీరికి మద్దతు పలుకుతున్నారు. వీరి కుటుంబ సభ్యులెవరైనా ఈ పనికి అలవాటుపడితే సమర్ధించగలరా?సంఘంలో తలెత్తుకోగలరా ?
     దక్షిణాఫ్రికా నుంచి రాగానే శ్రీమతి సోనియాగాంధీ గారు వీరిపట్ల విపరీతమైన సానుభూతిని ఒలకబోసేసి, వెంటనే ఆర్డినెన్సు తెచ్చేద్దామని తొందరపడ్డారు గానీ మరెందుకో మళ్ళీ ఆ ప్రయత్నం మానుకున్నారు. (SEE THIS LINK)  బహుశా వీరి వోట్లు కంటికి  పెద్దగా కనబడి వుండకపోవచ్చు. లేక ఇది ఇటలీ కాదు ఇండియా అని ఎవరో చెప్పి ఉండవచ్చు . అంతేకాక రేపెప్పుడైనా మీ పిల్లలో,వాళ్ళ పిల్లలో ఇటువంటి విపరీత పోకడలకి పోతారేమో అని భయపెట్టి ఉండవచ్చు.
       ఇక రాహుల్ గాంధీ గారి బాధ ఈ లింకులో చూడండి . బాబా రామ్ దేవ్ వీళ్ళ గురించి సందేహం వ్యక్తం చేసారు  ఈ లింకులో చూడండి .  
         ఆలస్యంగానైనా బీజేపీ వారు ఈ " గే "సంస్కృతికి మేము వ్యతిరేకమని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు దీనికి అంగీకరించవనీ కుండబద్దలు కొట్టి, పరువు కాపాడారు .  ఇప్పటివరకూ చీకట్లోనో రహస్యంగానో వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తున్నారు . సభ్య సమాజం చూసీ చూడనట్టు పోతోంది . దాన్ని అలాగే ఉండనివ్వండి . అంతేకానీ చట్టాలు చేసి బహిరంగంగా బరితెగించమని ప్రోత్సహించకండి!

4 కామెంట్‌లు: