21, నవంబర్ 2013, గురువారం

మోడీని గెలిపిద్దాం! దేశాన్ని రక్షించుకుందాం!

   దేశమంతా 2014 ఎన్నికల వేడి మొదలయింది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిని ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ యువరాజు గారు ఇంకా అట్ట కత్తులతో యుద్ధ విద్యలు ప్రాక్టీసు చేస్తున్నారు. పాపం ఆయన యుద్ధానికి సిద్ధమో కాదో తెలీక రాజమాతతో సహా వందిమాగధ పరివారమంతా సందిగ్ధంలో పడి  కొట్టుకుంటున్నారు .  పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నారో లేదో యువరాజు గారికే సందేహం. ఇక ఇప్పటికే ఆయన ఉపన్యాసాలలో ఆయన పాండిత్యం బయటపడిపోయి దేశ ప్రజలకి ఈయన పరిజ్ఞానం మీద సందేహాలు తలెత్తుతున్నాయి.

    అతి పురాతన,ఘనమైన చరిత్ర గలిగిన మన భారతదేశాన్ని  గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక కీలుబొమ్మ ప్రభుత్వం పరిపాలిస్తోందని తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. కీలుబోమ్మని ఎందుకంటున్నానంటే ఇటీవలే యువరాజు గారు కన్నెర్రజేస్తే  మొత్తం కేంద్రప్రభుత్వం చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ఆర్డినెన్సుని ఉపసంహరించుకున్న ఘటనని  ఇంకా మర్చిపోలేదు .
       ఈ పార్టీ నేతలే మోడీని నియంత అని ప్రచారం చేస్తున్నారు . ఎవరు నియంతలో ఎవరు కీలుబోమ్మలో ఇప్పటికే ఈ దేశ ప్రజానీకానికి అర్ధమయింది . నా ఉద్దేశ్యంలో ఇటలీ నియంతల కంటే మన  ఇండియన్ నియంతలే నయం అనుకుంటున్నాను.
        ఈ తొమ్మిదేళ్లుగా బియ్యం,నిత్యావసరవస్తువులు, పెట్రోలు,రవాణా చార్జీలు,విద్యుత్ చార్జీలు, ఉల్లిపాయలు, ఏది చూసినా పెరగడమే తప్ప తరగడం చూసామా?  టెలికాం, బొగ్గు, భూమి,ఆటలు, హెలికాప్టర్లు, రక్షణ, స్టాక్ మార్కెట్ ఎందులో చూసినా లక్షల కోట్లు మింగడమే తప్ప కక్కడం చూసామా? దేశాన్ని తగలబెట్టి, ఫిడేలు వాయించుకుంటూ ఇప్పుడు వోట్ల కోసం మొసలికన్నీళ్ళు కారుస్తున్నారు.
     దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపుతున్నా కాంగ్రెస్ నాయకులింకా నెహ్రూ కుటుంబ భజన మత్తు లోంచి బయటకు రాలేక పోతున్నారు . సమర్ధులైన నాయకులు కొరవడితే దేశం ఎలా నాశనమై పోతుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉదాహరణ . గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ అధి నాయకత్వం ఆంద్ర ప్రజలతో ఆడుకుంటున్న తీరు చూస్తే ఇది మనకర్ధమౌతుంది .
 ఇటువంటి పరిస్థితులలో దేశానికి దిశా నిర్దేశం చేయగలిగిన నాయకత్వాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా వుంది . దూర దృష్టి, నాయకత్వ పటిమ గలిగిన నాయకులలో ప్రస్తుతం ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించగలరని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను . ఆయన గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించాలనే ఆయన ఆలోచనలు, వివిధ సందర్భాలలో ఆయన ఉపన్యాసాలను ఈ క్రింది లింకులలో చూడండి. మోడీని గెలిపించి ఈ దేశాన్ని కాపాడండి. జైహింద్!
https://www.youtube.com/watch?v=Y4XXff-t3NY
https://www.youtube.com/watch?v=ymRH9z0gvVI
https://www.youtube.com/watch?v=e6j8FToJ9os
https://www.youtube.com/watch?v=qiTdu3Lu7C8

5 వ్యాఖ్యలు:

  1. తెలివిగా మాట్లాడి ప్రజల్ని సమ్మోహితుల్ని చేసి పార్తీకి వోట్లు తెచ్చిపెట్టరా అని పంపిస్తే "అమ్మ యేడ్చింది" అని ఒకసారి,"అమ్మ నన్ను తిట్టింది" అని ఒకసారి వాగి పడే వోట్లకి కూడా గండి కొట్టే ఈ నికమ్మా మనకు ప్రధాన మంత్రియా? 100+ వయసు గల పార్తీలో ఈ పెళ్ళి కాని ప్రసాదు తప్ప ఇంకెవడూ ప్రధాని పదవికి తగిన వాడు లేడంటే బయటి నుంచి చూస్తున్న మనకే యేమిటోగా ఉంది గానీ వాళ్ళకి మాత్రం అదే గొప్పగా ఉంది.

    ప్రత్యుత్తరంతొలగించు