ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన వార్త మానవత్వానికే సిగ్గుచేటు . కొడుకు,కోడలు కన్నతల్లిని కాలువలో తోసేసిన వార్త చదివి జీవితం మీద విరక్తి కలిగింది . అంత బాధలోనూ బిడ్డనేం అనొద్దని తల్లి చూపించే మమకారం చూసి ఈ ప్రపంచం తలదించుకోవలసిందే!
మనుషులు ఇంత కఠినంగా ఎందుకు మారుతున్నారు? భగవంతుడా మనిషిలో కొంచెం మానవత్వం మిగుల్చు!
మనుషులు ఇంత కఠినంగా ఎందుకు మారుతున్నారు? భగవంతుడా మనిషిలో కొంచెం మానవత్వం మిగుల్చు!
సమాజం కొద్ది కొద్దిగా కుళ్ళి మనుషులే కళ్ళ ముందు కనిపిస్తున్నా వాళ్లలో మానవత్వం లేని కారణం చేత చివరికి మనుషులు అని పిల్పించుకునే అర్హత ను కోల్పోతున్నారు.
రిప్లయితొలగించండిఇదొక్కటే కాదు, పేపర్ తెరవాలన్నా, టీవీ చూడాలన్నా భయం వేసేట్టుగా తయారైంది పరిస్థితి. ఆరేడేళ్ళ పసి పిల్లలో ఆడ తనాన్ని చూసే కామాంధులు, తల్లి ఆస్థి ఇవ్వలేదని ఎయిడ్స్ వైరస్ ఎక్కించే కూతురు, ఇదిగో కాలవలో పడేసే కొడుకు కోడళ్ళు,మరిది పెళ్ళి చూసి సహించలేక అతడి కాబోయే భార్య మీద యాస్డి పోయించే వదిన, విద్యార్థి మీద లైంగిక వేధింపులకు పాల్పడే న్యాయ కోవిదులు, ప్రేమించ లేదని ఆడపిల్లపై కిరోసిన్ పోసి తగల బెట్టే యువకులు..., అన్నం పెట్టక పోగా , తమ ఇంటి వైపు వస్తే కాళ్ళు విరిచేస్తామని తండ్రిని బెదిరించే కొడుకు, ఏ ఒక్కరూ మానవ సహజంగా ప్రవర్తిచడం లేదు. స్నేహం, సహనం, బంధం, ఆప్యాయత అనే పేర్లు నెమ్మది నెమ్మదిగా వర్షానికి తడిసిన ఇంకు అక్షరాల్లా కళ్ల ముందే చెరిగి పోతున్నాయి. ఇవన్నీ చూస్తూనే ఉంటాం! మనసు కలత పెట్టుకుంటూనే ఉంటాం. కాలం కరిగి పోతుంది. గతించి పొతాం.
పరిస్థితి ఇంకా ఘోరమై అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇంతే ఇక ఈ సమాజం! దీనికి ఏ శస్త్ర చికిత్సా, యాంటి బయాటిక్కూ పని చేయదు. ఆ స్థాయి దాటి పోయింది. రోగం పూర్తిగా ముదిరి పోయింది.
నిజమే . ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనస్సు కలుక్కు మంటుంది . లోకం నుండి మనం వేరై లోకాన్ని నిందిస్తుంటాం . మనమూ ఈ సమాజంలోని వాళ్ళమే . ఎవరికి వారు తమ కుటుంబాలలో ఇలాంటి ఘోరాలు నివారించ గలిగితే సమాజాన్ని నిందించ వలసిన అవసరమే రాదు కదా . వయసు మళ్ళిన తల్లి దండ్రులను పోషించాలంటే పెద్ద మనస్సు చేసుకొని భర్తలకు భార్యలు తోడ్పాటు నందించ వలసి ఉంటుందని గుర్తించాలి . అదంతా తమ బాధ్యత కాదనుకోవడం వల్లనే చిక్కంతా .
రిప్లయితొలగించండిరాజారావు గారూ నిజం చెప్పారు! మార్పు అనేది ముందు మన ఇంటినుండే మొదలవ్వాలి.మన పిల్లల్ని మనం మంచి విలువలతో పెంచితే వాళ్ళు సమాజంలో బాధ్యత గలిగిన పౌరులుగా మెలుగుతారు. ఈ సమాజం మారాలంటే ఇంతకు మించిన పరిష్కారం లేదు.
తొలగించండి