29, డిసెంబర్ 2013, ఆదివారం

అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు!

     ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కు  అభినందనలు! ప్రజాసమస్యల కోసం తన ఉద్యోగాన్నీ,సుఖాలనీ వదులుకొని నిజాయితీగా పోరాడుతున్న కేజ్రీవాల్ కు మద్దతు తెలియజెయ్యడం మన కనీస బాధ్యత!
     నిస్వార్ధంగా ప్రజాసేవ చేసేవారికి కూడా నిందలు తప్పని ఈ రోజుల్లో, ఢిల్లీ ప్రజలు పూర్తి మెజారిటీ ఇవ్వకపోయినా వచ్చిన అవకాశాన్ని వదలవద్దని నాలాంటి ఎంతో మంది చేసిన విజ్ఞప్తిని గమనించి అధికారం చేతిలోకి తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను . 
       భస్మాసుర " హస్తం" వెనుకనుండి ఇస్తున్న మద్దతుపై మీకే కాదు ఈ దేశ ప్రజలందరికీ సందేహాలున్నాయి! అయినా సరే, మనసా, వాచా, కర్మణా, మీరు చెప్పింది చెప్పినట్లుగా అమలు చెయ్యడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రయత్నం చెయ్యమని, అందులో మీరు విఫలమైనా,  ఈ దేశ ప్రజలు మీ చిత్తశుద్ధిని గుర్తుంచుకుని మీకు మరింత మద్దతు తెలియజేస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాము. 
   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీ దెబ్బకి తట్టుకోలేక మీకు మద్దతు ఉపసంహరిస్తే, మీ ప్రభుత్వాన్ని ఆదుకోవలసిన బాధ్యత  బీజేపీ పైన పడుతుంది . ఆ రకంగా వారి వైఖరి కూడా ప్రజలకి తెలుస్తుంది . కానీ మీరు ఎంచుకున్న ఎజెండా ప్రజోపయోగకరమైనది అయినప్పుడే మీకు అందరి అండదండలూ ఉంటాయనేది మర్చిపోవద్దు!
బెస్ట్ అఫ్ లక్! 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి