31, డిసెంబర్ 2013, మంగళవారం

2013 కు వీడ్కోలు పలుకుదాం!

    2013 అత్యాచారాల సంవత్సరంగా ఖ్యాతి గాంచింది . గత సంవత్సరం నిర్భయ పై అత్యాచార సంఘటన తరువాత ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా నిర్భయ చట్టం వొచ్చినా ఈ సంవత్సరం లోనే అత్యధికంగా స్త్రీలపై అత్యాచారాల కేసులు నమోదయ్యాయి . ఇంచుమించు ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచారం జరిగినట్టుగా వార్తలు వస్తూనే వున్నాయి . 2014 లోనైనా దీనికి అంతం పలకడానికి మార్గం దొరుకుతుందేమో చూద్దాం .
     ఇకపోతే ఈ సంవత్సరం రాజకీయంగా దేశానికి ఒక కొత్త దారి దొరికినట్టుగానే కనబడుతోంది . అవినీతి,ద్రవ్యోల్భణం , అసమర్దనాయకత్వం బారినుండి దేశానికి విముక్తి కలిగే రోజు తొందరలోనే వున్నట్టు ఆశ కలుగుతోంది . 
   కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2013 కు    వీడ్కోలు చెబుదాం!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి