31, మార్చి 2014, సోమవారం

ఎవరిదీ మత తత్వం?

మత రాజకీయాల మతలబు 

 

రేంద్ర మోడీ పేరు వింటేనే వైరి పక్షాలకి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఏదో విధంగా మోడీని  ప్రధాని కాకుండా అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి . కానీ దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మోడీ ప్రతిష్టని ప్రతిపక్షనాయకులే కాదు, స్వపక్షనాయకులు కూడా  అడ్డుకోలేకపోతున్నారు.ఈ దేశానికి ప్రస్తుతం ఆశాకిరణంగా కనిపిస్తున్న మోడీని మతతత్వముద్రతో అధికారానికి దూరం చెయ్యడానికి ప్రతిపక్షాలు-ముఖ్యంగా కాంగ్రెస్ నాయకగణం చేస్తున్న ప్రయత్నాలు అసహ్యం కలిగిస్తున్నాయి . అవసరమైతే మోడీని అంతం చేస్తాం!అంటున్న వారినాయకుల ఉన్మత్తపూరిత ప్రసంగాలకు  ముక్తసరి ఖండన తప్ప,  కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ అరాచకనాయకుల్ని  ఎన్నికలబరినుండి మాత్రం  తప్పించలేదు . 

         2002 లో గోద్రాలో రైలుపై పెట్రోలు పోసి అనేకమందిని సజీవదహనం చేసిన రాక్షసుల ఉన్మాదం గురించి ఎవరూ మాట్లాడరు. కానీ తదనంతరం జరిగిన అల్లర్ల గురించి మాత్రం గొంతు చించుకుని అరుస్తారు . వీరే ఈ రోజున మోడీని ఎదుర్కోలేక గోద్రా విషం చిమ్మయినా ఆయనని ప్రధాని కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు .
     ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదివితే ఈ మతత్వం పునాదులు ఎక్కడున్నాయో అర్ధమవుతుంది .     ఏది ఏమైనా మోడీ ప్రధాని కాకుండా ఎవ్వరూ ఆపలేరనేది ఇప్పటికే స్పష్టమయింది!

తెలుగు సోదరీ సోదరులందరికీ జయ నామ సంవత్సర                 ఉగాది శుభాకాంక్షలు!

3 కామెంట్‌లు:

  1. ఆంధ్రులందరికి ఉగాది శుభాకాంక్షలు.
    చిరకాలపు ఏడుపు, దరిద్రం, మత్తు వదిలిన
    తొలి శుభోదయం, సోమరితనం, బానిస
    చీడపురుగు మనల్ని విడిచిన నూతన వర్షం
    ఆంధ్రులకి ని"జయ"మైన విజయం.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. మీ రన్నది నిజం. యెవరూ వాస్తవాల్ని తెలుసుకుని విమర్శించటం లేదు. చిన్న చిన్న వాటికే అసహనం ప్రబలి పోయి హింసకు దిగే వారందరూ యేసు క్రీస్తు చెప్పిన దారి తప్పిన గొర్రె పిల్లల్లాగానూ ఇంత సహనంగా ఉన్నా హిందువులే మత తత్వ వాదులు గానూ కనబడుతున్నారు.ఇవ్వాళ వాళ్ళు చెప్పే అతున్నత ఆదర్శాలు ఈ మాత్రమయినా ఆదరణకు నోచుకుంటున్నా యంటే ఈ దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువుల్లో అధిక శాతం అవి మంచివని ఒప్పుకుని ఆచరిస్తుండడం వల్లే నని కూడా తెలుసుకోలేని మూర్ఖత్వం వాళ్ళది.

    రిప్లయితొలగించండి