6, మే 2014, మంగళవారం

వోటు హక్కును వినియోగించుకుందాం! నరేంద్ర మోడీని గెలిపిద్దాం!

  భారతదేశ రాజకీయాలలో కొత్త శకం మొదలయింది . రాబోయే రాజ్యం నరేంద్ర మోడీ సారధ్యం లోని ఎన్డీయే దే అనేది ఇప్పటికే స్పష్టమయింది . దేశంలోని అన్ని సర్వేలు, అన్ని మీడియా సంస్థలు ఇదే విషయాన్ని గొంతెత్తి చెపుతున్నాయి . రాబోయేది మోడీ ప్రభుత్వమేనని! 
    గుజరాత్ లో తానేమిటో నిరూపించుకుని, ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి పీఠానికి మారుతున్న నరేంద్ర భాయ్ మోడీ అందుకు నూటికి నూరు శాతం అర్హుడు . గుజరాత్ ను  అభివృద్ధి పధం లో పరుగులెత్తించి, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చేతుల మీదుగానే అనేక అవార్డులు అందుకున్న ఘనత నరేంద్ర మోడీదే .  రాష్ట్ర అభివృద్ధికి ఆయన అనుసరించిన విధానాలు, ఆయన  దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు  ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. విద్యుత్ రంగంలో అనితరసాధ్యమైన ప్రగతిని సాధించి  విద్యుత్ కోతలులేని రాష్ట్రంగా గుజరాత్ ను  తీర్చిదిద్దిన ఘనత మోడీ దే . 
    దేశంలోని నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు కల్పించగలడని అవినీతికి తావులేని భావి భారతాన్ని నిర్మించగలడని, కోటి ఆశలతో  అతి సామాన్య ప్రజానీకం సైతం ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటోంది . నరేంద్రమోడీ మాటల మనిషి కాదు, చేతల మనిషనేది ఇప్పటికే రుజువైంది . ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఈవ్యాసం చూడండి . అందుకే రేపు మన సీమాంధ్ర లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల అభ్యర్దులకు వోటు వేసి భారత దేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం . జై నరేంద్రమోడీ . 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి