17, అక్టోబర్ 2011, సోమవారం

తెలంగాణా నీరు గారినట్టేనా?

                  అంతా కెసిఆర్ కోరుకున్నట్టే జరుగుతున్నట్టుంది.సకల  జనుల సమ్మె నెమ్మదిగా పలచబడుతోంది. మొదట  RTC,తరవాత  టీచర్లు, త్వరలో TNGO లు.      రాజకీయనాయకులు మొదటినుండీ" గోపిలు " గానే ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పుబట్టలేము. వాళ్ళ నైజమే అది. పాపం వాళ్ళని నమ్మి గోతిలోకి దిగిన ఉద్యోగులు, విద్యార్ధులు, తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు.
 ప్రస్తుత ఉద్యమ రూపురేఖలు చూస్తే, ఇది  సామాన్య ప్రజానీకం మనస్సులో తెలంగాణ వాదం బలంగా లేదనే అనిపిస్తోంది.అంతిమ స్థాయికి వచ్చిన తరువాత కూడా ఉద్యమం చప్పగానే సాగుతోంది.కేవలం టీవీ చానళ్ళలో నాయకులూ, వారి భజన గణాల ప్రచార కండూతి తప్ప, నిజమైన ఉద్యమ స్ఫూర్తి ఒక్క నాయకుడి లోనూ కనబడలేదు.అందుకే సీమాంధ్ర ఎంపీ కావూరి, తెలంగాణా నాయకులు పదవులు వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండలేరని అవహేళన చేసాడు.(ఇది ప్రతి రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. తనదాకా వస్తే)అది వాస్తవమనేది తెలంగాణా రాజకీయ నాయకులు రుజువు చేస్తున్నారు.
TNGO నాయకుడు స్వామీ గౌడ్ ఇటీవల చాలాసార్లు రాజకీయ నాయకుల వైఖరి పట్ల తన ఆవేదనని బహిరంగం గానే వెళ్లగక్కారు.     ఆయన ఆవేదన తెలంగాణ  ఉద్యమ కారుల నిజమైన ఆవేదనని ప్రతిఫలించింది.  సామాన్య ప్రజల  భాగస్వామ్యంతో జరిగే ఉద్యమాలు ఈ విధంగా ఉండవనేది స్పష్టం. సామాన్య ప్రజలలో నిజంగా తెలంగాణా కావాలనే కోరిక బలంగా వుంటే ఈ పాటికే ప్రజలు,పిచ్చి గంతులు వేస్తున్న  రాజకీయనాయకులకు సమాధికట్టి, ఉద్యమ నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వుండేవారు. అయితే కోదండ రాం లూ వగైరాలు సామాన్యులే కదా అనుకుంటే పొరపాటే.ఆయన కెసిఆర్ ముసుగు  అని తెలంగాణలో గోచిపెట్టని పిల్లగాల్లకి కూడా తెలుసు. ఇది కేవలం రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం ఆడుకుంటున్న ఆట అన్న విషయం కూడా తెలంగాణా ప్రజలకు తెలుసు. ఎవరో కొంతమంది మధ్య తరగతి మేధావులు, అమాయక విద్యార్ధులు గొంతు చించుకోవడమే తప్ప , సామాన్యుడు ఇందులో భాగస్వామి కాలేదనేది సుస్పష్టం.నిజంగా సామాన్యుడు కోరుకుంటే ఈ ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయాన్ని గౌరవించి తీరవలసిందే.
 బాబ్ర్రీ మసీదు నిలబడి ఉన్నంత కాలం," బీజేపీ" రామ జన్మభూమి పేరుతో ఎలా వాడుకుందో తెలంగాణా వాదం ఉన్నంత కాలం దాన్ని వాడుకోడానికి  చెన్నారెడ్డిలు, కేసీఆర్ లు పుట్టుకొస్తూనే ఉంటారు. వందలమంది అమాయక జీవులు  ప్రాణాలు బలి ఇస్తూనే ఉంటారు.తెలంగాణా వచ్చినా చచ్చినా సామాన్య జీవి కి ఒరిగేదేమీ ఉండదనేది అందరికీ తెలుసు. వారి గోచీ అలాగే ఉంటుంది గానీ అంగీ అయిపోదు. నాయకులకే హోదాలు మారతాయి.డిల్లీ నాయకుల పుణ్యమాని ఇప్పటికే రాష్ట్రం నాసనమయ్యింది.  డిల్లీ సుల్తానీ గారి పుట్టిన రోజు తొందరగా రావాలని, ఈ సమస్య పరిష్కారం అవ్వాలనీ  ఆ భగవంతుడిని కోరుకుందాం.
కొసమెరుపు: తెలంగాణా రాజకీయనాయకురాలిగా విజయశాంతి  ఓవర్ ఏక్షన్  డోకొస్తోంది.  యాక్!

2 కామెంట్‌లు:

  1. ఆ రైల్వే చట్టం ఏదో గాని, వీళ్ళ గుండెల్లో రైళ్ళు వురుకుతున్నయ్. ఏదో ఒకటి రెండు రోజులు మంచిగుంటది గాని, వారాలు బందులు, రైళ్ళు, బస్సులు రోకోలు చేస్తే జనాలు రోసిపోతారని తెలియదా ఈ డేడ్‌దిమాగ్ గాళ్ళకి? జనాలు నష్టపోయినా, పార్టీలు, యూనియన్ నాయకులు ఏమీ నష్టపోలేదని తెలుస్తోంది. మంచిగ వసూల్జేసుకున్నరు. తెరాస విలీనం ఇంకో నెలరోజులు పడుతుంది, కెసిఆర్కి గవర్నరు ఎక్కడిస్తారు, హరీష్ రావు విజయశాంతి చర్లపల్లిలో ఒకటే సెల్ ట్రై చూసుకుంటరు, కెటిఆర్ చంచల్ గూడ, కవితమ్మ ముషీరాబాద్ జైలు.

    రిప్లయితొలగించండి
  2. నీరు కారుడు కాదు, వుచ్చ వుచ్చ కారుడు అంటున్నరు.

    రిప్లయితొలగించండి