|
సాక్షి వార్త |
ఏటో గానీ ఇయ్యాల సర్వే సత్తన్నకి ఆల్లోల్లమీద సేలా కోపమొచ్చేసింది. కాళ్ళుమీద పడేలాగా కడుపు సించేసుకున్నాడు. ఎలాగన్నా ఆయన లెక్కే యేరు. మా సెడ్డ మాలోకం. మొన్నేమో అయిలన్న, నిన్నేమో గద్దరన్న. ఇయ్యాల సత్తెన్న. ఇంకా సేలా మంది సెప్పేరుకానీ, సత్తెన్న లాగా ఎవలూ ఇలాగ ఇడదీసి పచ్చి నిజాలు సెప్పెయ్యలేదు. అవునూ ఈల్లంతా సీమాన్ద్రోల్లనుకుంటాను. లేపోతే అమెరికా వోడి ఏజెంట్లయ్యుంటారు. పాపం అందరూ ఆ జేఏసీ వోల్లు మీద రాళ్ళేసేసే వోళ్ళే. ఆల్లేమో పొగులనకా రేత్రనకా, ఎండనకా వోననకా, తెలంగానాకోసం కట్టపడి రోడ్లంటపడి తిరుగుతుంటే ఆవారాగాల్లనేత్తాడేటీ! మరీ ఎటకారం కాపోతే! పొద్దత్త మానం కలెచ్చన్లూ ఎలచ్చన్లే నేంటి? మడిసన్నాక కాసింత కలాపోసనుండాలని, ఏదో మనోళ్ళు మందు పార్టీలు సేసుకుని, బిర్యానీలూ తిన్నారే అనుకో. నువ్వు మీటింగెట్టేసి పేపరోల్లకి టముకేసేత్తే ఆల్ల పరువేంగావాలా? వుప్పుడికే, అదేదో సమ్మె, ఆ!! సకలజనాల సమ్మె కాడ్నించి అందరూ మీ వోల్లని తెగేడిపిత్తన్నారు . నువ్వేమో ఉన్నా పంచి కూడా ఊడపీకేత్తన్నావు. జాగర్త మరి. ఆల్లు సేలా మంది సంగతి సూసేసేరు. మరి నీసంగతి కూడా సూసేగల్రు.
అయినాగాపోనా మన్లో మన మాట. ఆవు సేలో మేత్తుంటే, దూడ గట్టుమీద మేత్తాదేంటి? నీకు తెలగ్గాపోతేనీ! అయినా నాకెందుకులే సత్తన్నా, మీరూ మీరూ పడండి. మల్లీ మీవోల్లు నాకు బడేడుత్తారు! ఎందు కొచ్చిన గొడవ! ఉంకో పాలి కలుత్తాన్లే, జాగర్త!
Why are you so happy? FYI all these people (Sarve, Gaddar, Manda Krishna etc.) all support Telangana formation. This is all we care about, not their rivalries.
రిప్లయితొలగించండిహిహిహీ! బందులు రైలు రాస్తా రోకోలూ సకలసమ్మెలు పేరుతో మీరు అనుభవించిన "హింసానందం" ముందు మాదెంతా!
రిప్లయితొలగించండి