12, నవంబర్ 2011, శనివారం

బాంఛత్! ఇదీ సవాలంటే!!


ఆయనో మంత్రి.  రాష్ట్రాన్ని పరిపాలించవలసిన మంత్రులలో ఒక మంత్రి. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్న(?) మంత్రిమండలిలో ఒక మంత్రి. ఆ మంత్రి మండలికి  నాయకుడు ముఖ్యమంత్రి. ఆ  ముఖ్య మంత్రిని పట్టుకుని ఆయన మంత్రులలో ఒక మంత్రి,  దమ్ముంటే మంత్రి పదవినుంచి తప్పించమని సవాల్ విసురుతున్నాడంటే ఈ సర్కారు  తాళం చెవి ఎక్కడుందో తెలీట్లేదూ?   పాపం ముఖ్య మంత్రి.  ఏదో అనుకోకుండా  లాటరీలో జాక్పాట్ తగిలేసి ముఖ్యమంత్రి కుర్చీ దొరికేసింది గానీ, పీతల గంప లాంటి మంత్రి మండలిని అదుపులో పెట్టడం చేతగావట్లేదు.  ఎక్కడికి పోయినా కుర్చీ కూడా పెట్టుకుని పోతున్నాడు. ఏ నిమిషంలో ఎవడు తన్నుకు పోతాడోనని. ఆయనకి ఆ కుర్చీ వుంటే చాలు. మంత్రులేమంటే తన కెందుకూ,ఎలా పోతే తన కెందుకు?  పోయేది జనమే కదా!  ఏం చేస్తాం,  ఇది తెలుగువాడు చేసుకున్న ఖర్మ.  తన (?) మంత్రులనే అదుపులో పెట్టలేనివాడు అధికారుల్ని,ప్రభుత్వ  వ్యవస్థని ఏం అదుపులో పెట్టగలడు? అసలీ రాష్ట్రంలో ప్రభుత్వ మెక్కడ ఉందీ? అంతా తోలుబోమ్మల రాజ్యమే కదా!    డిల్లీ మేడం గారు పంపిన సర్కస్  కంపెనీలో తెలుగు జనాన్ని సంతోష పెట్టటానికి జోకర్లని  కూడా పంపించారనుకుని .చూసి ఆనందపడటమే మన పని.  మళ్ళీ తెలుగోడి పరువు డిల్లీ సుల్తాన్ల తాకట్టులోకి పోయింది.  ఎవర్ననుకుని ఏం లాభం? మన బంగారం మంచిది కానప్పుడూ,  మనోళ్లదగ్గర  సరుకు లేనప్పుడూ!!

2 కామెంట్‌లు: