మానవుడికి జీవించే హక్కుని మనం రాసుకున్న రాజ్యాంగాలు కల్పించాయి. కానీ మనతోటి మానవుడి జీవించే హక్కుని మనమే కాల రాస్తున్నామా?
నాలుగురోజుల క్రితం నా మిత్రుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. చనిపోవలసిన వాడు జీవచ్చవంలా మిగిలాడు. అతనిపై ఆధారపడిన అయిదుగురు సభ్యుల కుటుంబం రోడ్డున పడింది. కారకుడు ఒక కారు యజమాని. ఎంతో ఆత్మాభిమానం గలిగిన నా మిత్రుడు క్షోభ అనుభవిస్తున్నాడు. చిన్న ప్రయివేటు కంపెనీలో పనిచేస్తూ కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న అతడు ఉదయం వెళ్తే మళ్ళీ ఇంటికొచ్చేది రాత్రి ఎనిమిది గంటలకే. ఆ రోజూ తన టూవీలర్ మీద వెళ్ళినవాడు రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. తలకి హెల్మెట్ ఉండబట్టి బతికిపోయాడు. లేనట్టయితే ప్రాణాలు పోగొట్టుకునేవాడే. ప్రమాదానికి కారణం కారు హెడ్ లైట్లు. కళ్ళు చూడలేని ఎంతో ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళల్లో పడేసరికి ఎదుట ఏముందో కనబడలేదు.ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచే సరికి కాళ్ళు చేతులు విరిగి రోడ్డు పక్కన పడి ఉన్నాడు.
ఇది న్యాయమా? మనలో ఎంతమంది తమ కార్లకి ,మోటార్ సైకిళ్ళకి,హెడ్ లైట్లకి "బ్లేక్ షేడ్" వేయిస్తున్నాం? హెడ్ లైట్లకి నలుపు రంగు వేయించకపోవడం వల్ల ఎంత మంది ప్రమాదాలకి గురవుతున్నారో మన వరకూ వస్తేనే గానీ మనకి తెలియదా?
రాత్రయితే రోడ్డు మీద వాహనం మీద వెళ్ళాలంటే ఎదురుగా వచ్చే వాహనం వెళ్ళిపోయే వరకూ ఆగి వెళ్ళవలసిన పరిస్తితులున్నాయి. ప్రతి వాహన తయారీదారూ ఇప్పుడు పోటీలుపడి మరీ అత్యంత వెలుతురు నిచ్చే హాలోజెన్ బల్బులూ, మెర్కురీ బల్బులూ, LED బల్బులూ అమరుస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ హెడ్ లైటు పైన నలుపురంగు వేయించడం లేదు. ప్రభుత్వం, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కళ్ళు మూసుకు కూర్చున్నాయి. ఇలా ఎవరైనా గొడవ చేస్తే ఇది కూడా వారికి దండుకోవడానికి బాగా పనికొస్తుందే తప్ప ఆచరణలో శూన్యమే మిగుల్తుంది. అందుకే తయారీ దశలోనే దీనిని తప్పనిసరి చేయవలసిన అవసరముంది.
అంతేకాకుండా సాటి మానవులుగా మనమే మన పక్క వాడికి హాని కలిగించకూడదనే జ్ఞానంతో వ్యవహరించి మన వాహనాల లైట్లకి నలుపు రంగు వేయిస్తే కనీసం కొన్ని ప్రాణాలైనా మిగులుతాయి. ఆలోచించండి!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి