మనిషికి నీడ నివ్వడమే ఆ చెట్లు చేసిన పాపమా? ఒక పక్క జీవ వైవిధ్య సదస్సులు పేరుతో గొప్పలు చెప్పుకుంటూ టీవీలలో కోట్ల ఖర్చుతోప్రభుత్వం ప్రకటనలిస్తోంది. ఇక్కడ పదివేలకి కక్కుర్తిపడి పదిమందికీ నీడనిస్తున్న పచ్చని చెట్లని పడగొట్టెయ్యడానికి ఆ వూరి తాసిల్దారు చేస్తున్న దుష్ట ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఆ గ్రామ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా! ఆ నోరు లేని వృక్షాలు చేసిన తప్పేమిటి? ఎవరికి అడ్డుగా వున్నాయని ? ఏం పాపం చేశాయని?
ఈ చెట్లవల్ల ప్రమాదం పొంచివుందట! కూలిపోడానికి సిద్ధంగా వున్న స్కూళ్ళలో దినదిన గండంగా చదువుతున్న పిల్లల ప్రాణాల గురించిగానీ, గట్టిగా వానొస్తే పడిపోయే పూరి గుడిసెలలో నివసిస్తున్న పేదవాళ్ళ గురించి గానీ, పట్టించుకోడానికి తీరిక లేని ప్రభుత్వాధికారులకి ఏ పాపం ఎరుగని ఈ చెట్లపై కన్నుపడింది. ఈ భూమ్మీద ఇంకా మనుషులున్నారని నిరూపిస్తూ ఆ గ్రామస్తులు ఆ చెట్లని, చల్లని తల్లులుగా భావించి వాటిని నరకకుండా అడ్డుపడుతున్న ఈ చిత్రాన్ని చూస్తుంటే గుండె గొంతుక లోకి రావడంలేదూ? పెద్దగా చదువుసంధ్యలు లేని పల్లె వాసులైనా వారు చూపిస్తున్న మానవత్వం మనందరికీ ఆదర్శం. మన వంతు కర్తవ్యంగా ఈ అకృత్యాన్ని ప్రపంచానికి చాటుతూ, ఆ దుర్మార్గ తాసిల్దారుకి ఈ దుశ్చర్యని ఆపమని హెచ్చరిద్దాం!
saakshi లో ప్రచురించబడిన వార్త ఈ లింకులో చూడండి!
saakshi లో ప్రచురించబడిన వార్త ఈ లింకులో చూడండి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి