31, జనవరి 2013, గురువారం

నేతల్ని ప్రశ్నించకండి! వారి మూతులు నాకండి!

 సాక్షి వార్త .30/1/13


        కాంగ్రెస్ పార్టీ భావిభారత ప్రధాని శ్రీ శ్రీ శ్రీ రాహుల్ గాంధీ గారి ఉవాచ చూసారా! 
ఆయన ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన నాయకత్వం ఏ విధంగా వుండబోతోందో చెప్పకనే చెప్పారు. 
              ప్రజలు తాము ఎన్నుకున్న నాయకులు దేశాన్నీ ప్రజల్నీ, గాలికొదిలేసి, ప్రజల సొమ్ముతో  పదవీ భోగాలు అనుభవిస్తూ,   గడ్డి మేస్తుంటే  మీరు చేతులు కట్టుకుని  వారి మూతుల వంక చూస్తూ ఉండండి.    వారిని ప్రశ్నించకండి! అంటూ హితబోధ చేస్తున్నారు. ఇదీ అసలైన కాంగ్రెస్ మార్కు వారసత్వం. ఒక ప్రక్క పెరిగిపోయిన ధరలతో ప్రజలు ఒక పూట కూడా తినలేని పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా ఒక్కసారి కూడా నోరు పెగలని ఈ భావి కాంగ్రెస్ ప్రధాని అప్పుడే యువత నోటికి తాళాలు వేస్తున్నారు.  ఇక అధికార అందలం ఎక్కితే ప్రజల పరిస్థితేమిటో? భగవంతుడా నా దేశాన్నీ నా ప్రజల్నీ ఈ నేతల బారినుండి కాపాడు తండ్రీ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి