11, ఫిబ్రవరి 2013, సోమవారం

ఈ దేశానికి మోడీ వంటి దార్శనికుడు కావాలి!

       భారతదేశం సమర్ధులైన నాయకుల కోసం అర్రులు చాస్తోంది. అంతులేకుండా పెరిగిపోతున్నధరలతో సామాన్యుడి బ్రతుకు భారమై పోయింది.అటు కేంద్రం ఇటు రాష్ట్రప్రభుత్వాలు  ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకు పోతున్నాయి. అసమర్దులూ, దేశాన్ని పాలించడం రాని వారూ,సామాన్యుల కష్టాలు తెలియనివారూ అందలాలెక్కి కూర్చున్నారు.
ఈ దేశం గతి ఇంతేనా?
        ఢిల్లీలోని దేశప్రసిద్ధిగాంచిన శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ ( SRCC )లో ఆ కాలేజ్ విద్యార్ధుల కోసం జరిగిన "Business Conclave 5" లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఈ దేశానికి ఇటువంటి నాయకులే  కావాలనుకునేంతగా ఉత్తేజ పరిచింది.  విచిత్ర మేమిటంటే ఆ సదస్సుకు ముఖ్యఅతిధిగా ఎవర్ని పిలవాలనే విషయమై ఆ కాలేజ్ విద్యార్ధుల మధ్య జరిగిన  వోటింగ్ లో రాహుల్ గాంధీని తోసిరాజని  మోడీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ దేశ నవతరం  ఏం కోరుకుంటున్నారనేది ఆ కాలేజి విద్యార్దులు రుజువు చేసారు. వారి అంచనాలను వమ్ము చేయకుండా తనదైన శైలిలో ప్రసంగించిన మోడీ గుజరాత్ సాధించిన అభివృద్దినీ, ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
      ఆయన చేసిన కృషికి గుజరాత్ ప్రజలనుంచి  ప్రశంసలందుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం మనం మరువకూడదు. వాజ్ పాయ్ తరువాత బీజేపీకి ముందుండి నడిపించగల నాయకుడే కరువయ్యాడు. ప్రస్తుత పరిస్థితిలో దేశ ప్రజానీకం తమను ఆదుకోగల నాయకుడి కోసం చూస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించైనా బీజేపీ మోడీకి నాయకత్వ పగ్గాలు అప్పగించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
       ఇక షరా మామూలుగా  తెల్లవారితే భజన చేయడానికి చిడతలు పట్టుకుని తయారయ్యే కొంతమంది  కాంగ్రెస్ నాయకులు 2002 లో జరిగిన అల్లర్ల మాటేమిటీ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న అరాచకాల మాటేమిటీ? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, రాజీవ్ గాంధీ చనిపొయినప్పుడూ జరిగిన వూచకోతల గురించి కూడా మాట్లాడండి. ప్రజలు ఎవరేమిటన్నది ప్రతి ఎన్నికలలోనూ రుజువు చేస్తూనే వున్నారు.రాబోయే కాలంలో కూడా రుజువు చేస్తారు. అసమర్ధులు ఎవరెన్ని కూసినా ఇటువంటి దార్సనికుడూ,  ధైర్యవంతుడే  ఇప్పుడీ దేశానికి అవసరం.                                
 ఆయన ప్రసంగాన్ని ఈ లింకులో చూడండి!                                                      
 ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు సాక్షి పత్రికలో చదవండి!  

3 కామెంట్‌లు:

  1. ఎంతో విలువైన సమాచారం తెలిపినందుకు కృతజ్ఞతలు.
    సగం నీటితోనూ , సగం గాలితోనూ , కాబట్టి పూర్తి లోటా నిండి ఉన్నదని చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది. చమత్కారాలకు లోటు లేదు. మీరన్నట్టు పనిచేసే ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంత నిమగ్నమై మాట్లాడుతూ కూడా అరగంటకే ఇచ్చిన సమయం ముగిసిందా అని చూసుకోవడం, సమగ్ర అభివృద్ధి గురించి, ఈ దేశపు వనరుల గురించి, మానవ వనరుల గురించి అంత నమ్మకంగా, గౌరవముంచి నిరూపించి మాట్లాడే రాజకీయనాయకులున్నారా? మామూలు మనుషులు కూడా ఇది ఇండియా అని తేలికగా మాట్లాడుతారు. మోడీ గారికి నమస్కారములు.

      తొలగించండి
    2. నిజం చెప్పారు లక్ష్మీ దేవి గారూ! మీరన్నట్టుగా ఆయన సమయపాలన నిజంగా నన్ను ముగ్ధుడ్ని చేసింది.కృతజ్ఞతలండీ

      తొలగించండి